నందమూరి నాల్గవ తరం వారసుడితో వై.వి.ఎస్

కొంతమంది డైరెక్టర్స్ కి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అలా.. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలను పరిచయడం చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడు వై.వి.ఎస్. చౌదరి. ‘దేవదాసు’ సినిమాతో రామ్ ని, ‘రేయ్’ మూవీతో సాయిధరమ్ తేజ్ ను హీరోలుగా మార్చిన ఘనత వై.వి.ఎస్. దే. ఇప్పుడు టాలీవుడ్ కి మరో హీరోని ఇంట్రడ్యూస్ చేసే పనిలో ఉన్నాడట ఈ వెర్సటైల్ డైరెక్టర్.

నటరత్న నందమూరి తారకరామారావు అభిమానిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వై.వి.ఎస్.. నందమూరి హరికృష్ణతో సూపర్ హిట్స్ అందించాడు. వై.వి.ఎస్. డైరెక్షన్ లో వచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య’ సినిమాలు హరికృష్ణను హీరోగా ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇప్పుడు హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ తనయుడిని హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నాడట వై.వి.ఎస్. చౌదరి. ఇప్పటికే ఈ నందమూరి నాల్గవతరం వారసుడి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసిన వై.వి.ఎస్.. త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను పంచుకోనున్నాడట.

Related Posts