టాలీవుడ్

సుకుమార్ తో ప్రభాస్

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని కోరుకోని దర్శకుడుంటాడా. ఇక ప్రాంతీయ దర్శకులు సినిమాలు చేస్తే ఓవర్ నైట్ వాళ్లు కూడా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం అవుతారు. అందుకే డార్లింగ్ తో ఆఫర్ అంటే అది బంపర్ ఆఫర్ గానే చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛాన్స్ ను కొట్టేశాడు దర్శకుడు మారుతి.

మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది వర్కింగ్ టైటిల్ గానే చూస్తున్నారు. కానీ కన్ఫార్మ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు సుకుమార్ కాంబోలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అది సుకుమార్ డైరెక్షన్ లో కాదు.


నిజానికి ప్రభాస్ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ కుదర్లేదు. ఈ లోగా అతను ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. అటు సుకుమార్ కూడా పుష్పతోప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించాడు. అయినా ఇప్పట్లో వీరి కాంబో సినిమాకు ఆస్కారం లేదట. కానీ సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో ప్రభాస్ నటించబోతున్నాడుఅనేది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం తనే కాదు. తన శిష్యులతో కూడా బ్లాక్ బస్టర్స్ కొటిస్తున్నాడు సుకుమార్. తన శిష్యుడి డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడు అనేది కొత్త వార్త. అయితే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అంతా సుకుమారే అందిస్తాడట. డైరెక్షన్ చేయడు కానీ.. అన్నీ దగ్గరుండి చూసుకుటాడు అంటున్నారు. అందుకే ప్రభాస్ కూడా ఈ ప్రపోజల్ కు ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు.


ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సలార్ షూటింగ్ ఆఖరి దశకు వచ్చింది. ప్రాజెక్ట్ కే ఈ యేడాది చివరికి పూర్తవుతుంది. మారుతి మూవీ కూడా అంతే. కాకపోతే జనవరిలో ఓ వారం పది రోజులు షూటింగ్ ఉండే ఛాన్సుందట. అంటే మరో ఆరు నెలల తర్వాత పూర్తిగా ఖాళీ అవుతాడు. అందుకే కొత్త ప్రాజెక్ట్స్, కథలపై కాన్ సెంట్రేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కొత్త సినిమాలు ఓకే అయినా ఆశ్చర్యం లేదు. పైగా ఇకపై యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తానని ఇంకతు ముందు ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాడు కదా. దాన్ని ఫాలో అవుతూనే ఈ ప్లానింగ్ అంతా కనిపిస్తోంది. కాకపోతే సుకుమార్ బ్యానర్ తో పాటు ఆయన డైరెక్షన్లోనే సినిమా చేస్తే బావుంటుంది అనేది అభిమానుల ఆలోచన.

Telugu 70mm

Recent Posts

Kavya Kalyanram

12 mins ago

Srinidhi Shetty

20 mins ago

Shraddha Das

shraddhadas43

31 mins ago

Krithi Shetty

43 mins ago

హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ప్రభాస్ ఎంట్రీ

టాలీవుడ్ మూవీస్ ఇప్పుడు హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఉంటున్నాయి. 'బాహుబలి'తో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్.. ఇప్పుడు పాన్ వరల్డ్…

3 hours ago