ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. డబుల్ ట్రీట్ గ్యారెంటీ

డార్లింగ్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా సలార్ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అంతా ఊహించినట్టుగా క్రిస్మస్ బరిలోనే దిగుతున్నాడు. డిసెంబర్ 22న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఆదే రోజు షారుఖ్ ఖాన్ డంకీ కూడా విడుదలవుతుంది. కాబట్టి ప్యాన్ ఇండియా లెవల్లో ఈ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ పోటీ తప్పదు. అలాగే ఆల్రెడీ క్రిస్మస్ కు డేట్స్ వేసుకున్న తెలుగు సినిమాలన్నీ వాయిదా పడకా తప్పదు. సలార్ ప్రమోషన్స్ విషయంలో చాలా వీక్ గా కనిపించింది. అంటే సెప్టెంబర్ 28న రాలేం అని తెలుసు కాబట్టే అప్పుడు అలా చేశారు. బట్ ఇప్పుడు రిలీజ్ డేట్ వచ్చింది కాబట్టి.. ఇక ప్రమోషన్స్ కూడా షురూ చేయాలనుకుంటున్నారు. అందుకోసం డార్లింగ్ స్టార్ బర్త్ డే నుంచి సరికొత్తగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నారు.


ఈ సారి ప్రభాస్ బర్త్ డే, దసరా పండగ ఒకే రోజు వచ్చాయి. అంటే ఫ్యాన్స్ కు డబుల్ హ్యాపీనెస్ ఉంటుంది. దాన్ని మరో స్థాయికి తీసుకువెళుతూ.. ప్రభాస్ బర్త్ డే రోజున సలార్ ట్రైలర్ విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. యస్.. దసరా, ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తూ.. ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సలార్ మేకర్స్ ఇప్పటికే రెండు మూడు వెర్షన్స్ కట్ చేసుకుని ఉన్నారని టాక్.

ఈ సారి ట్రైలర్ మామూలుగా ఉండదు అంటున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కు హైప్ వచ్చినా.. అందులో ప్రభాస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ లో నిరాశ తప్పలేదు. బట్ ఈ సారి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. బిజినెస్ సర్కిల్స్ కూడా ఊగిపోయేలా ట్రైలర్ కట్ ను ప్లాన్ చేసుకున్నారట. సో.. ఇక సలార్ రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద క్లారిటీ వచ్చినట్టే అనుకోవాలి.

Related Posts