పాటలు లేని ప్రభాస్ సినిమాలు

ఓ కమర్షియల్ హీరో సినిమాలో పాటలు లేవు అంటే ఎలా ఉంటుంది. కానీ ప్రభాస్ అలాగే రాబోతున్నాడు. అస్సలు ఉండవు అని కాదు కానీ ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేసేలా పాటలు ఉండవు అని టాక్. పైగా ఒక సినిమాలో కాదు. రెండు సినిమాల్లో పాటలు లేకుండానే వస్తున్నాడట ప్రభాస్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సలార్ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని సమాచారం. వీటిలో ఒకటి హీరో ఎలివేషన్ కోసం సాగే మాంటేజ్ సాంగ్. మరోటి ఓ సెంటిమెంట్ సాంగ్ అంటున్నారు. అంటే రెగ్యులర్ డ్యూయొట్స్ తో పాటు స్పెషల్ సాంగ్స్ అంటూ ఏమీ ఉండవు. కేవలం కథానుసారం వచ్చే రెండు సాంగ్స్ మాత్రమే కనిపిస్తాయని టాక్.


ఇక కల్కి 2868 ఏడిలో ఆ స్పేస్ కూడా లేదట. ఇది స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా కాబట్టి పాటలు అక్కర్లేదు అనుకున్నారు. పైగా భవిష్యత్ కాలంలో సాగే కథ కదా.. అందుకే ఆ టైమ్ కు ఇలాంటి డ్యూయొట్స్ కు కాలం చెల్లిపోతుందనే లాజికల్ పాయింట్ ఉంటుందట. అయినా కేవలం ఒక పాట మాత్రం కనిపించే అవకాశం ఉందంటున్నారు. అది కూడా ప్రభాస్ పై ఉండకపోవచ్చట. మొత్తంగా ఈ రెండు సినిమాల్లో పాటలు లేని లోటును మారుతి సినిమా తీరుస్తుందంటున్నారు.


మారుతి డైరెక్షన్ లో నటిస్తోన్న రాజా డీలక్స్(వర్కింగ్ టైటిల్) లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అంటూ ముగ్గురు హీరోయిన్లున్నారు. ఈ ముగ్గురితో తలో డ్యూయొట్ ఉంటుందట. అలాగే ముగ్గురితో కలిపి ఓ సాంగ్ ఉంటుందట. అంటే ఫ్యాన్స్ కు పండగే అన్నమాట. వీటికి తోడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే అంశాలన్నీ ఉంటాయని చెబుతున్నారు. దర్శకుడు మారుతి కాబట్టి ఆ పాటలను మంచి మనోరంజకంగా రూపొందించే అవకాశం ఉంది. మొత్తంగా.. ప్రభాస్ సలార్, కల్కి చిత్రాల్లో పాటలు ఉండవు. ఉన్నా ప్రభాస్ కు డ్యాన్స్ వేసే అవకావం లేదు అనేది నిజమేనట.

Related Posts