Kasthuri : ప్రభాస్ రాముడిలా కనిపించడం లేదంటోన్న మాజీ హీరోయిన్

దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న మూవీ ఆదిపురుష్‌. రామాయణంలోని కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం ఇది. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించారు.

ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్‌ ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. నార్త్ లో ఫర్వాలేదు కానీ.. ఈ మూవీపై సౌత్ లో ఎప్పటి నుంచో కొన్ని కమెంట్స్ ఉన్నాయి.

ప్రధానంగా మనవాళ్లు సీతారాములుగా చెప్పుకుంటారు. ఈ సినిమాలో రాఘవుడు జానకి అంటున్నారు. ఈ పేర్లు బొత్తిగా మనం పలకనివి. దీంతో పాటు రాముడుగా ప్రభాస్ లుక్ పైనా కమెంట్స్ ఉన్నాయి. మొదటి ట్రైలర్ ఆకట్టుకున్నా.. రెండో ట్రైలర్ మాత్రం యానిమేషన్ ను తలపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ కామెంట్స్ అన్నీ కామన్ ఆడియన్స్ నుంచి ఎక్కువగా వినిపించాయి. అయితే ఓ మాజీ హీరోయిన్ సైతం ఇదే ఫీలవుతూ ఏకంగా ట్వీట్ చేసింది.


90ల్లో తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కస్తూరి ఆదిపురుష్ పై చేసిన కామెంట్ హాట్ గా మారింది. తను చేసిన కమెంట్ ఎలా ఉందంటే.. ” రామ లక్ష్మణులకు మీసాలు, లాంగ్ హెయిర్ ఉన్నట్టుగా ఏ సంప్రదాయంలో అయినా ఉందా..? ఎందుకీ అనవసరమైన వ్యవహారం. ముఖ్యంగా ప్రభాస్ తెలుగు భాషలో. శ్రీ రాముడు పాత్రను ఎంతోమంది లెజెండ్స్ పర్ఫెక్ట్ గా పోషించారు. నాకైతే ప్రభాస్ రాముడులా కాదు.. కర్ణుడులా కనిపిస్తున్నాడు. ” అంటూ ట్వీట్ చేసింది.

దీనికి నెటిజన్స్ నుంచి మాగ్జిమం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. పైగా ఇప్పటి వరకూ రాముడు పాత్ర పోషించిన వారి ఫోటోస్ ను కూడా యాడ్ చేస్తూ ఎవరికీ మీసాలు లేవు అంటున్నారు. మరి కస్తూరిపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తాయో చూడాలి.

Related Posts