ఆదిపురుష్‌ సెన్సార్, రన్ టైమ్ అప్డేట్

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్‌ సెన్సార్ పూర్తయింది. కాకపోతే హిందీ వెర్షన్ కు మాత్రమే. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. ఇండియన్ ఎపిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని ఈ నెల 16న విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీపై మంచి అంచనాలను క్రియేట్ చేయగలిగింది మూవీ టీమ్. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మూవీ టీమ్ లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు కొన్ని విమర్శలు ఉన్నా.. మొత్తంగా ఈ చిత్రాన్ని హిందువులంతా చూడాల్సిందే అన్న థాట్ క్రియేట్ చేయగలిగారు అనే చెప్పాలి. అయితే ఈ రాముడు ఇప్పటి వరకూ మనం చూసిన వెండితెర రాముళ్లకు భిన్నంగా కనిపిస్తున్నాడు అనేది నిజం. ఈ విషయంలో సౌత్ ఆడియన్స్ కాస్త డిజప్పాయింటింగ్ గా ఉన్నా.. ఇది రామాయణం.. ఆయన రాముడు అన్న కలరింగ్ మాత్రం తెచ్చారు.


మొత్తంగా హిందీలో ఈ చిత్ర సెన్సారింగ్ అయిపోయింది. సెన్సార్ నుంచి ఆదిపురుష్ కు ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్ వచ్చింది. ఇక రన్ టైమ్ 179 నిమిషాలు. అంటే మూడు గంటలకు ఒక్క నిమిషం తక్కువ. రన్ టైమ్ ఈ మధ్య వస్తోన్న చిత్రాలతో పోలిస్తే కాస్త ఎక్కువగా అనిపిస్తున్నా.. ఇది అందరికీ తెలిసిన కథ.

ఆ కథను జనరంజకంగా చెప్పగలిగే స్క్రీన్ ప్లే, మంచి పాటలు, డైలాగ్స్ తో ఉంటే మూడు గంటలకు పెద్ద మేటరేం కాదు. ఒకప్పటి రామాయణ చిత్రాలు కూడా మనకు దాదాపు ఇంతే నిడివితో ఉండేవి. కాబట్టి ఆదిపురుష్‌ కు రన్ టైమ్ పెద్ద సమస్య కాదు అనే చెప్పాలి.

Related Posts