”రంగబలి”.. టైటిల్ మాస్.. టీజర్ హిలేరియస్

స్ట్రగులింగ్ స్టార్ నాగ శౌర్య లేటెస్ట్ మూవీ ”రంగబలి”. శౌర్య సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ విడుదలైంది. నాగశౌర్య ఇప్పటి వరకూ తన కటౌట్ కు తగ్గట్టుగా రకరకాల జానర్స్ లో సినిమాలు చేశాడు. బట్ అతను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేసినప్పుడే విజయాలు అందుకున్నాడు. గతంలో వచ్చిన బిగ్ హిట్ ”ఛలో” అలా వచ్చిన సినిమానే.

ఇక ఈ లేటెస్ట్ మూవీ ”రంగబలి” కూడా టైటిల్ కు భిన్నంగా కంప్లీట్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. టైటిల్ ఎంత మాస్ గా ఉందో.. టీజర్ అంత హిలేరియస్ గా ఉందని చెప్పాలి. బి ఫార్మసీ చదివినా.. అది ఒంటబట్టక తండ్రి మెడికల్ షాప్ లో కూడా సరిగా పనిచేయని ఓ బేవార్స్ కుర్రాడు.. అతని ఫ్రెండ్. ఇతనికి ఓ డాక్టర్ తో లవ్. టీజర్ లో ఇదే కనిపిస్తున్నా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ వార్స్ కూడా ఉంటాయనిపిస్తోంది.

ఇక నాగశౌర్య ఈ పాత్రలో చాలా ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తున్నాడు. అతని ఫ్రెండ్ గా సత్య ఫుల్ లెంగ్త్ రోల్ చేసినట్టున్నాడు అతను పంచే కామెడీ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఇంతకు ముందు ఛలోలో కూడా వీరి కాంబినేషన్ అద్భుతంగా వర్కవుట్ అయింది.


శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి పవన్ బాసంశెట్టి దర్శకుడు. హీరోయిన్ కూడా చూడ్డానికి బావుంది. ఇక శౌర్య ఫాదర్ గా గోపరాజు రమణ నటించాడు. అతను తన భార్యతో కొడుకు గురించి చెబుతూ మెడికల్ లో చెప్పే ” ఏమే ఈ ముసలావిడి మోషన్స్ కావడానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావడానికి టాబ్లెట్ ఇస్తున్నాడు” అనే డైలాగ్ అదిరిపోయింది. అంటే బి ఫార్మసీ చదువుకున్నా.. అందులో కుర్రాడికి ఏ నాలెడ్జ్ లేదని చెప్పేందుకు కూడా ఈ సీన్ హెల్ప్ అయింది.

అలాగే టీజర్ చివర్లో వచ్చిన షాట్ కు యువతరం ఫిదా అయిపోతుందనే చెప్పాలి. శౌర్య, సత్య బస్ లో వెళుతుంటారు. సడెన్ గా గుడి కనిపించినట్టుగా దండం పెట్టుకుంటారు. కట్ చేస్తే అది వైన్ షాప్. పైగా ఆ షాప్ ను చూస్తూ ” ఎప్పుడు నీ దగ్గరకు వచ్చినా మంచి బ్రాండ్ లు దొరికేలా చూడు స్వామి” సత్య అంటాడు.. దీన్ని బట్టి ఏపి మద్యంపైనా సెటైర్స్ ఉంటాయనుకోవచ్చు. మొత్తంగా రంగబలి టైటిల్ కు భిన్నంగా మంచి ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది.

Related Posts