ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ఇప్పటికే ‘కల్కి’ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. ఈ ఏడాది మే నెలలో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాతో పాటు ‘రాజా సాబ్’ కూడా చిత్రీకరణ దశలోనే ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇక.. ఈ ఏడాది ద్వితియార్థంలో సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ పట్టాలెక్కించనున్నాడు. ఆ తర్వాత ‘సలార్ 2’ లైన్లో ఉంది.
ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ‘సీతారామం‘తో పాన్ ఇండియా హిట్ కొట్టిన హను రాఘవపూడి.. రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఓ పీరియడ్ మూవీ చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తన మార్క్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట హను రాఘవపూడి. యు.వి.క్రియేషన్స్ తో కలిసి ఓ బాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాకోసం గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నాడట హను రాఘవపూడి. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. ప్రభాస్ మూవీ కోసం తన రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హను దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం‘ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్నందించాడు విశాల్ చంద్ర శేఖర్. ఇక.. ‘సీతారామం‘ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ప్రభాస్-హను రాఘవపూడి మూవీపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.
జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని…
ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…
ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…
Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…
Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…
There is a huge demand for the audio rights of movies starring star heroes. There…