టాలీవుడ్

మారుతిని డిజప్పాయింట్ చేసిన ప్రభాస్

ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ దూకుడుకు కంట్రీ మొత్తం షేక్ అవుతుంది. రాధేశ్యామ్ తర్వాత వచ్చిన ఆదిపురుష్ పోయినా.. అతని నెక్ట్స్ మూవీస్ లైనప్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ఆ రేంజ్ లో ఉన్నాయి ప్లానింగ్స్. రీసెంట్ గా వచ్చిన సలార్ టీజర్ ఆశించినంత గొప్పగా లేకపోయినా.. సినిమా మాత్రం మాస్ ను షేక్ చేస్తుందని చెబుతున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఆగస్ట్ లో ట్రైలర్ విడుదలవుతుందని అఫీషియల్ గానే చెప్పారు. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న ఈ మూవీతో వైజయంతీ బ్యానర్ కీర్తి దిగంతాలకు వ్యాపించబోతోంది అనే నమ్మకంతో ఉన్నాడు నిర్మాత అశ్వనీదత్. ఇక ఆ తర్వాత రావాల్సిన సినిమా మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న రాజా డీలక్స్(వర్కింగ్ టైటిల్).

రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండటం విశేషం. హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోన్న ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు మారుతి.

ఎక్కువ భాగం ఒకే సెట్ లో షూటింగ్ ఉండటంతో ప్రొడక్షన్ కు పెద్దగా టైమ్ పట్టడం లేదు. ఈ సినిమా త్వరగా పూర్తి కావడానికి ఇదీ ఓ రీజన్. అయితే సమ్మర్ లో విడుదల చేయడం కష్టం అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా టైమ్ వెచ్చించాడు మారుతి.య సమ్మర్ లో రిలీజ్ అయితే ఆ తర్వాత నెక్ట్స్ మూవీకి వెళ్లాలనుకున్న మారుతిని డిజప్పాయింట్ చేస్తున్నాడు ప్రభాస్.


రాజా డీలక్స్ 2024 సమ్మర్ లో విడుదల కావడం అసాధ్యం అంటున్నారు. ఇప్పటికి వినిపిస్తోన్న దాన్ని బట్టి.. వచ్చే యేడాది దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు ప్రధాన కారణం.. సలార్2. సెప్టెంబర్ 28న సలార్ ఫస్ట్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ ను అస్సలు ఆలస్యం చేయకుండా వచ్చే వేసవిలోనే విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్.

ఆ ప్లాన్ లో భాగంగానే రాజా డీలక్స్ ను వెనక్కి నెడుతున్నారు. కానీ ముందుగా అనుకున్న షెడ్యూల్ లో సమ్మర్ లో ఉన్నది మారుతి సినిమానే. ఆ తర్వాతే సలార్ 2 అనుకున్నారు. మరి మధ్యలో ఏమైందో కానీ.. ఇప్పుడు మారుతిని మరీ దూరంగా పెట్టేశారు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

7 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

10 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

10 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

10 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

11 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

16 hours ago