పవన్ వారాహి ఎక్కుతున్నాడు. మరి సినిమాలు..?

కొన్నాళ్ల క్రితం పొలిటికల్ గా యమా యాక్టివ్ గా ఉండటంతో ఆ టైమ్ లో ఒప్పుకున్న సినిమాలను పక్కన బెట్టాడు పవన్ కళ్యాణ్‌. అతను ఎప్పుడు డేట్స్ ఇస్తాడో ఇవ్వడో ఎవరికీ అర్థం కాకుండా ఉండేది. సెట్స్ కు వచ్చినా.. షూటింగ్ అయ్యేంత వరకూ ఉంటాడా అనే అనుమానం కూడా ఉండేది. అంటే పొలిటికల్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వెళ్లిపోయేవాడు. ఇక 2024 ఎన్నికలు అయిపోయేంత వరకూ ఇలాగే ఉంటుంది అనుకున్నారంతా. బట్ సడెన్ గా మళ్లీ సినిమాలకు వచ్చాడు. ఫుల్ బిజీగా షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో కొత్తగా బ్రో, ఓజి వంటి చిత్రాలు ఒప్పుకున్నాడు. ఆల్రెడీ కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ చేశాడు. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో తిరుగులేని ఉత్సాహాన్ని నింపాడు. సో.. ఇక మళ్లీ షూటింగ్స్ తోనే బిజీగా ఉంటాడు అని భావిస్తోన్న తరుణంలో సడెన్ గా తన జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొన్ని యాగాలు, పూజలు చేశాడు. వీటి తర్వాత ఇక తను ఎప్పుడో సిద్ధం చేసుకున్న వారాహి వాహనాన్ని బయటకు తీశాడు. అంటే మళ్లీ పొలిటికల్ గా బిజీ అవుతున్నట్టే కదా..?


వారాహితో ఆంధ్రప్రదేశ్ లో తిరగాలని ముందే నిర్ణయించుకున్నాడు పవన్. దీనికి కొంత గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ లోనే ఈ చిత్రాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు వారాహితో బయలుదేరుతున్నాడు అంటే మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటీ..? వాటి నిర్మాతల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న మళ్లీ ఉత్పన్నం అవుతుంది. కొంతలో కొంత బ్రో చిత్రానికి సంబంధించిన పవన్ కళ్యాణ్‌ పార్ట్ అంతా పూర్తయింది.వచ్చే నెల 28న ఈ చిత్రం విడుదల కూడా కాబోతోంది.

మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి. ఈ రెండు సినిమాలపైనే ఫ్యాన్స్ ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. పైగా ఈ మూవీస్ తో కొత్త రికార్డులు కూడా వస్తాయని ఇండస్ట్రీ కూడా భావిస్తోంది. బట్ పవన్ మాత్రం ఛలో వారాహి అంటున్నాడు. ఆల్రెడీ ఈ తరహా సిట్యుయేషన్స్ తోనే హరి హర వీరమల్లు దర్శక నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. మరి ఈ రెండు సినిమాల గతి ఏమౌతుందో చూడాలి.

Related Posts