పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ దూకుడు లాస్ట్ ఇయర్ కనిపించలేదు. కానీ మూడు నెలల క్రితం నుంచి సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందులోనూ సెలెక్టివ్ మూవీస్ చేస్తున్నాడు. అలాగని పొలిటికల్ సినిమాలు కాదు. తన ఇమేజ్ కు తగ్గట్టుగా.. అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో ఆ తరహా కథలతో వస్తున్నాడు. వీటిలో ప్రధానంగా సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ”ఓజి”కి ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.
ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పుడు ఇచ్చిన డేట్స్ కంటే కొన్ని రోజుల తర్వాత పెంచిన డేట్స్ ఎక్కువ. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి కూడా. మళయాలీ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్ విలన్. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ క్రమంలో ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కోసం మరో పవర్ ఫుల్ విలన్ ను తీసుకున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల్లో తన బేస్ వాయిస్ తో అదరగొట్టిన అర్జున్ దాస్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ మేరకు మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అర్జున్ దాస్ విలనీ కూడా ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాలో వైవిధ్యమైన పాత్రలో మెప్పించాడు. ఇక అతని బేస్ వాయిస్ కు తమిళ్ తో పాటు తెలుగులోనూ చాలామంది అభిమానులున్నారు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…