గోపీచంద్ నెక్ట్స్ మూవీ విశ్వం

మేచో స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. దాన్ని నిలబెట్టుకోవడంలో కొన్నాళ్లుగా తడబడుతున్నాడు. తన ఇమేజ్ కు తగ్గ కథలు అంటూ మాగ్జిమం అవుట్ డేటెడ్ స్టోరీస్ తో వస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద దెబ్బైపోతున్నాడు. వస్తోన్న సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి. చివరగా వచ్చిన రామబాణంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అది మరీ డిజాస్టర్ గా మిగిలింది.

ప్రస్తుతం భీమా అనే సినిమా చేస్తున్నాడు. కన్నడ మాస్ డైరెక్టర్ ఏ హర్ష రూపొందిస్తోన్న సినిమా ఇది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. భీమా వచ్చే యేడాది మార్చిలో విడుదలవుతుందని సమాచారం. ప్రస్తుతం చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తర్వాత గోపీచంద్ దర్శకుడు శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నాడు.


గోపీచంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరూ డిజాస్టర్స్ లో ఉన్నారనే సెటైర్స్ కూడా వచ్చాయి. కథ విషయంలో గోపీచంద్ ఓ పట్టాన ఓకే చేయలేదట. దీంతో పట్టువదలకుండా అతనికి నచ్చినట్టుగా ఫైనల్ స్క్రీప్ట్ రెడీ చేసి ఓకే చేయించుకున్నాడు శ్రీను వైట్ల. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందట. అన్నీ కుదిరితే దసరా నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో ఓ మేజర్ పార్ట్ ను విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు. ఆ మేరకు లొకేషన్స్ ను చూస్తున్నారట ఇప్పుడు. ఇక ఈ చిత్రానికి రెండు అక్షరాలు చివర్లో సున్నా అనేలా ఉండాలనుకునే గోపీచంద్ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. ” విశ్వం” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. మరి ఈ రెండు మూవీస్ తో గోపీచంద్.. విశ్వంతో శ్రీను వైట్ల బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.

Related Posts