సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ మెయిన్ లీడ్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ టీజర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్.
యాక్షన్, డ్రామా, ఫన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకులని అలరించింది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ పాత్రల ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. టీజర్ చివర్లో వైవా హర్ష చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది.సునీల్ చేతిపై జై చిరంజీవా అనే టాటూ ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ చిత్రానికి సంగీతం అందించింది ‘రీ’. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.