తేజమే రెహమానేనా.. అని పాడుతున్న ‘ది గోట్‌ లైఫ్‌ ‘ (ఆడు జీవితం)

బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ డైరెక్షన్‌లో విజువల్ రొమాన్స్ బ్యానర్ నిర్మించిన మూవీ ‘ది గోట్‌ లైఫ్‌ (ఆడు జీవితం). ఈ సినిమాలో మళయాళ స్టార్‌ పృధ్విరాజ్‌ సుకుమారన్‌ లీడ్‌ రోల్ చేసారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా నుంచి ‘తేజమే రెహమానేనా..’ అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేశారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎడారి కష్టాల్లో ఉన్న హీరో తన ప్రేయసిని తల్చుకుంటూ పాడే ఎమోషనల్ సాంగ్ ‘తేజమే రెహమానేనా..’ . ఈ పాటలో రెహమాన్ కనిపించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరిగిన ఏడారికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మ�