పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప 2’ ప్రభంజనం

‘పుష్ప 2’ మ్యూజికల్ జర్నీ ఇటీవలే మొదలైంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పుష్ప పుష్ప’ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదలైన గంటల్లోనే ‘పుష్ప 2’ సాంగ్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. మొత్తంగా ఆరు భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇక.. ఒక్కో భాషా విషయానికొస్తే.. హిందీలో 24.5 మిలియన్లు సాధించిన ఈ సాంగ్.. తెలుగులో 21 మిలియన్లు, బెంగాలీలో 2.2 మిలియన్లు, కన్నడలో 2 మిలియన్లు, మలయాళంలో 1.8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అయితే.. కాస్త నిరాశపరిచే విషయం ఏమిటంటే ఈ సాంగ్ తమిళంలో కేవలం 1 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించడం.

Related Posts