టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ఏడాది ద్వితియార్థంలో తమ సినిమాలతో వరుసగా థియేటర్లలోకి క్యూ కట్టబోతున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ ఆగస్టులో వస్తుంటే.. ఎన్టీఆర్ ‘దేవర’ అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోంది. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా అక్టోబర్ లేదా నవంబర్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాల విడుదలకు ఇంకా కేవలం కొంత సమయమే ఉండడంతో.. చిత్రీకరణలో స్పీడు పెంచారు మేకర్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్ గోవాలో జరుగుతుంది. అక్కడ హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ కొరటాల శివ. మరికొన్ని రోజుల పాటు గోవాలోనే ‘దేవర’ షూటింగ్ జరగనుందట. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్న ‘దేవర’ నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో.. ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు.
ఆగస్టులోనే ‘పుష్ప’రాజ్ ఆగమనం ఉంది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ‘పుష్ప 2’ విడుదలవుతోంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఇంటర్వెల్ ఎపిసోడ్ షూట్ జరుగుతుందట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో లావిష్ గా ఈ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఒకవైపు ‘ఇండియన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చక్కబెడుతూనే.. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ను పూర్తిచేస్తున్నాడు శంకర్. ఇటీవల రాజమండ్రి నుంచి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పిక్స్ లో రామ్ చరణ్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది.
ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంతో సందడి చేయబోతున్నాడు చరణ్. రాజమండ్రి పరసర ప్రాంతాల్లో ఒక వారం రోజుల పాటు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ జరగనుందట.
Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…
In the past, most of the films were two and a half hours long. However..…
Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…
Creating wonders with debut directors is not a common thing. This has been proved many…
మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…
నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…