సౌత్ ఎన్టీఆర్ మాత్రమే సరిపోతాడట

కొన్నాళ్లుగా ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతోంది బాలీవుడ్. పఠాన్ తో కొత్త ఊపు తెచ్చాడు షారుఖ్ ఖాన్. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ మూవీ వెయ్యి కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ కు కొత్త ఊపిరి పోసింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు రాలేదు అనుకుంటోన్న తరుణంలో అనూహ్యంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా గదర్2.

రెండు దశాబ్దాల క్రితం వచ్చిన గదర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. తాజాగా 500 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. నిజానికి ఫస్ట్ పార్ట్ కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించింది అప్పట్లో. ఫస్ట్ పార్ట్ భారత్, పాకిస్తాన్ విడిపోయిన తరుణంలో రూపొందింది.ఈ పార్ట్ పార్టీషన్ తర్వాత పాతికేళ్లకు సాగే కథగా మలిచాడు. అంటే 1970ల నేపథ్యంలో సాగుతుందన్నమాట.

మొదటి చిత్రాన్ని రూపొందించిన అనిల్ శర్మ ఈ సీక్వెల్ ను హ్యాండిల్ చేశాడు. సన్నీడియోల్ తో పాటు అమీషా పటేల్ నటించగా ఇప్పుడు వారి కొడుకుకు సంబంధించిన ప్రేమకథా నేపథ్యంలో మళ్లీ పాకిస్తాన్ కు వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చినట్టుగా అల్లుకున్న ఈ కథ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. దీంతో పాటు అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ కూడా వచ్చింది. అయినా గదర్ 2 డామినేటింగ్ పర్ఫార్మెన్స్ తో భారీ కలెక్షన్స్ ను సాధిస్తోంది.


ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు అనిల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాడు. గదర్ సినిమాను సన్నీడియోల్ కాకుండా వేరే హీరోతో తీయాల్సి వస్తే ఎవరు సరిపోతారు అని అడిగారు. అందుకు ఆ పాత్రను పోషించగలిగే సత్తా ఉన్న నటుడు సన్నీ కాకుండా బాలీవుడ్ లో ఎవరూ లేరు. సౌత్ లో మాత్రం ఎన్టీఆర్ ఒక్కడే సరిపోతాడు అని బదులిచ్చాడు.

దీన్ని బట్టి బాలీవుడ్ లో సినిమా చేయకుండానే కేవలం ఆర్ఆర్ఆర్ తోనే ఎన్టీఆర్ అక్కడ ఎంత ఇంపాక్ట్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఆర్టిస్టుల్లో అతను వేరే ఇంకే పేరూ చెప్పలేదు. జస్ట్ ఎన్టీఆర్ మాత్రమే అనడాన్ని చూస్తే అతని నటనకు అక్కడ ప్రేక్షకులే కాదు.. దర్శకులు కూడా ఫ్యాన్సే అనుకోవచ్చు. మరి నిజంగానే గదర్3 తీస్తే అతను ఎన్టీఆర్ ను తీసుకుంటాడా..

Related Posts