పెళ్లి చేసుకున్న గరుడవేగ నటుడు

టాలీవుడ్ లోనూ వరుస పెళ్లిల్లవుతున్నాయి. తాజాగా మరో నటుడు పెళ్లి పీటలెక్కి మూడుముళ్లు వేశాడు. అదిత్ అరుణ్ గా తెలుగు తెరకు పరిచయమై రీసెంట్ గా త్రిగుణ్ అంటూ పేరు మార్చుకున్న కుర్రాడు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు.

ఇతను తెలుగుతో పాటు తమిళ్ మూవీస్ లోనూ నటించాడు. 2009లో వచ్చిన కథ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు త్రిగుణ్. తర్వాత తుంగభద్ర, పిఎస్వీ గరుడవేగ, మనసుకు నచ్చింది, 24 కిస్సెస్ డియర్ మేఘ, డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ, కథ కంచికి మనం ఇంటికితో పాటు రీసెంట్ గా వచ్చిన ప్రేమదేశం వంటి సినిమాల్లో హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడలో రూపొందుతోన్న లైన్ మేన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.


వీటిలో కథ సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే గరుడవేగలో అతని పాత్ర చాలా బావుంటుంది. తుంగభద్రతో విజయం అందుకుంటాడు అనుకున్నారు. బట్ రాలేదు. డియర్ మేఘ, ప్రేమదేశం చిత్రాలు కమర్షియల్ గా ఆకట్టుకోకపోయినా కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నాయి.


మంచి హ్యాండ్సమ్ కుర్రాడే అయినా త్రిగుణ్ కు ఇప్పటి వరకూ టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లో కూడా సరైన బ్రేక్ రాలేదు. ఆ బ్రేక్ కోసం చూస్తున్న ఇతను లేటెస్ట్ గా పెద్దలు కుదర్చిన పెళ్లి చేసుకున్నాడు. ఇది పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన పెళ్లి. మరి రిసెప్షన్ కు టాలీవుడ్ నుంచి తన ఫ్రెండ్స్ ను ఇన్వైట్ చేస్తాడేమో చూడాలి.

Related Posts