హాఫ్‌ సెంచరీ కొట్టిన ఖుషీ

విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. మొదటి రోజే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు 20 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే 51 కోట్లు కలెక్షన్స్ సాధించింది.

రెండు రోజుల్లోనే ఈ ఫిగర్ అంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చినట్టే. సమంత ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ రోజులు షూటింగ్ చేశారు కానీ.. ఇది పరిమిత బడ్జెట్ లో రూపొందించిన సినిమానే. దేశం దాటి వెళ్లకుండానే పూర్తి చేశారు.

కశ్మీర్, హైదరాబాద్, కాకినాడలోనే షూటింగ్ మొత్తం కానిచ్చారు. ఆర్టిస్టులు మరీ ఎక్కువగా ఏం లేరు. అందువల్ల రికవరీ పెద్ద సమస్య కాదు. కాకపోతే ఎన్ని లాభాలు వచ్చాయన్నదే ఇక మిగిలి ఉంటుంది.
అయితే ఈ చిత్రానికి వర్షాలు పెద్ద అడ్డంకి సృష్టిస్తాయి అంటున్నారు.

శనివారం సాయంత్రం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. దీని ప్రభావం సినిమా కలెక్షన్స్ పడుతుందనేది నిజం. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి.. ఈ వర్షాల్లో వాళ్లు వస్తారు అని చెప్పలేం. ఓ రకంగా వర్షం లేకపోతే ఆదివారం కూడా దాదాపు ఇవే ఫిగర్స్ రిపీట్ అవుతాయనేది విశ్లేషకుల అంచనా.

ఇక ఈ విజయాన్ని విజయ్ దేవరకొండ బాగా ఆస్వాదిస్తున్నాడు. యాదగిరిగుట్టకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నాడు. కొన్ని థియేటర్స్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టు టాక్. మొత్తంగా ఖుషీ బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా సూపర్ హిట్ అనిపించుకుంటుందనే చెప్పాలి.

Related Posts