యువ సామ్రాట్ నాగచైతన్య మరో డైరెక్టర్ ను రిపీట్ చేసే సన్నాహాల్లో ఉన్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‘ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘ప్రేమమ్, సవ్యసాచి‘ సినిమాలొచ్చాయి. ఇప్పుడు ‘తండేల్‘ సినిమా వీరి కలయికలో మూడోది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతన్య.
నాగచైతన్య-శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ‘మజిలీ‘ మంచి విజయాన్ని సాధించింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లిస్టులో ‘మజిలీ‘కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాలో విభిన్న పార్శ్వాలున్న పాత్రలో అదరగొట్టాడు చైతూ. ఇప్పుడు మరోసారి నాగచైతన్య ను ఓ డిఫరెంట్ లో రోల్ లో చూపించడానికి కథ సిద్ధం చేస్తున్నాడట లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ. విజయ్ దేవరకొండ ‘ఖుషి‘ తర్వాత శివ నిర్వాణ డైరెక్ట్ చేసే సినిమా ఇదే కానుంది. త్వరలోనే నాగచైతన్య-శివ నిర్వాణ కాంబో మూవీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.
సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…
విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…
నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…
Ram Charan and Upasana couple reached Delhi on the occasion of awarding Padma Vibhushan award…
Janasenaani Pawan Kalyan is getting an unexpected response from the film industry. Apart from family…