HomeMoviesటాలీవుడ్'ఓం భీమ్‌ బుష్' సెన్సార్ కంప్లీట్

‘ఓం భీమ్‌ బుష్’ సెన్సార్ కంప్లీట్

-

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మెయిన్ లీడ్‌తో రాబోతున్న కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్‌ బుష్’ . నో లాజిక్‌ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ హుషారు ఫేమ్‌ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ మూవీని వి సెల్యులాయిడ్ నిర్మించగా యువి క్రియేషన్స్ ప్రజెంట్ చేస్తోంది. మార్చి 22 న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యింది. U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్.


సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హిలేరియస్ వన్-లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్.

రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్ అందించేలా భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది

ఇవీ చదవండి

English News