సమ్మర్‌లో సత్యం రాజేష్ ‘టెనెంట్’

కమెడియన్ నుంచి హీరో గా ఎంటర్ అయ్యాడు సత్యం రాజేష్. పొలిమేర రెండు సినిమాలతో భారీ సక్సెస్‌ అందుకున్నారు. ఇప్పుడు వై యుగంధర్ డైరెక్షన్‌లో మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ ‘టెనెంట్’ చేస్తున్నాడు.

ఈ చిత్రం నుంచి విడుదలయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేటి సమాజంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుందంటున్నారు మేకర్స్.


మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

Related Posts