‘కంగువ’ టీజర్.. నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్

సూర్య నటిస్తున్నపాన్ వరల్డ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’. కమర్షియల్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ కాగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనువిందు చేయబోతున్నాడు. వీటితో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

లేటెస్ట్ గా ‘కంగువ’ సిజిల్ టీజర్ పేరుతో స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఓ ఫిక్షనల్ వరల్డ్ ను ఈ సినిమాకోసం సృష్టించాడు డైరెక్టర్ శివ. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలతో టీజర్ ఆద్యంతం సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. హీరోకి మించి విలన్ అన్నట్టుగా భయంకరమైన ఆహార్యంతో సూర్య, బాబీ డియోల్ పాత్రలు ఆకట్టుకుంటున్నాయి. సైన్యంతోనే కాదు.. ఈ సినిమాలో పులి, మొసలి వంటి జంతువులతోనూ సూర్య చేసే సాహాసాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో మనుషులు, వాళ్ల ఆచార వ్యవహారాలు కొత్తగా కనిపిస్తున్నాయి. కేవలం 50 సెకన్ల నిడివితో విడుదలైన టీజర్ అయితే ‘కంగువ’ అనే ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ఈ వేసవి బరిలోనే ‘కంగువ’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts