పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజి. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే పదాలకు షార్ట్ ఫామ్ ఇది. ఆరంభించడమే ఫైర్ స్ట్రామ్ అంటూ స్టార్ట్ చేశాడు దర్శకుడు సుజిత్. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ ను ఇప్పటి వరకూ చూడనంత ఫెరోషియస్ గా చూపించబోతన్నాడు అని ఇప్పటికే అర్థమైంది. ఇక సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల అప్డేట్ చూస్తోంటే ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.
పైగా జాయిన్ అవుతున్న కొత్త ఆర్టిస్టులంతా సినిమాను నెక్ట్స్ లెవల్ లో లేపుతున్నారు. ముఖ్యంగా సుజిత్ డైరెక్షన్ గురించి అదే పనిగా చెప్పుకుంటున్నారు. సుజిత్ ఇప్పటి వరకూ చేసింది రెండు సినిమాలే. అయినా వీటిలో సాహో ఉంది. అది చాలు.. అతను పవన్ ను హ్యాండిల్ చేయగలడు అని చెప్పడానికి. సాహో అతని వయసుకు మించిన ప్రయత్నం. అయినా ఆకట్టుకున్నాడు కూడా. ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లను మనం అంతకు ముందు చూడలేదు. అది అతనికి తన కథపై ఉన్న విజన్ కి నిదర్శనం.
ఇక ఈ మూవీ కథ నచ్చడం వల్లో లేక సుజిత్ డైరెక్షన్ నచ్చడం వల్లో కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన డేట్స్ కంటే ఎక్కువ రోజులే కేటాయించాడు. మొదట ముంబైలో మొదలైన షెడ్యూల్ ఐదు రోజులే. కానీ పవన్ పది రోజుల వరకూ ఇచ్చాడు. తర్వాత కూడా రెండో షెడ్యూల్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ కు కేటాయించిన డేట్స్ ను కూడా ఓజికే ఇచ్చాడు. అందుకే రెండు షెడ్యూల్స్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా థర్డ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిందంటూ అప్డేట్ ఇచ్చింది.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ లేని లేని సీన్స్ ను చిత్రీకరించారట. అంటే విలన్స్ కు సంబంధించినవి. అందుకే ఓజిలో ఓ విలన్ గా నటించిన అర్జున్ దాస్ సినిమా గురించి అదే పనిగా పొగుడుతున్నాడు. ఇక మెయిన్ విలన్ గా ఎవరూ ఊహించని రేంజ్ లో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పేరు తెచ్చుకున్న అక్కడి స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీని తెచ్చాడు సుజిత్.
నిజంగా ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇమ్రాన్ కూడా ఒప్పుకోవడం గొప్ప విషయమే. మొత్తంగా చాలా తక్కువ టైమ్ లోనే మూడు షెడ్యూల్స్ పూర్తి కావడం అనేది ఓ స్టార్ హీరో సినిమాకు సంబంధించి పెద్ద విషయమే. పక్కా ప్లానింగ్ ఉంటే తప్ప ఇలాంటిది సాధ్యం కాదు. మరి నెక్ట్స్ షెడ్యూల్ కు పవన్ కళ్యాణ్ జాయిన్ కావొచ్చు అంటున్నారు. అంటే త్వరలోనే ఈ మూవీ నుంచి ఓ టీజర్ లేదా గ్లింప్స్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
Director Mohan Raja directed the movie 'Godfather' with Megastar Chiranjeevi. The film is a remake…
Young hero Sudheer Babu's latest movie is 'Harom Hara'. Malavika Sharma acted opposite Sudheer Babu…
We are seeing Bollywood senior beauties getting married one by one and having children. Deepika…
Sensational director Prashant Neel is announcing two or three more projects as a bonus after…
Wherever there is a party, the first thing that comes to mind is the cinema.…
After the blockbuster like 'Baby', Anand Deverakonda's upcoming movie 'Gam Gam Ganesha'. Pragathi Srivastava, Karishma,…