ఓ.జి టీజర్ వచ్చింది. చూడ్డానికి ఓ రేంజ్ లో ఉంది. వెయిట్.. ఓజి అంటే పవన్ కళ్యాణ్ సినిమా కాదు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తోన్న సినిమా. ఈ సినిమా పేరు ”ఘోస్ట్”.. బిగ్ డాడీ ఈజ్ బార్న్ అనేది క్యాప్షన్.
కన్నడలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. కన్నడలో తిరుగులేని స్టార్డమ్, ఫ్యాన్ బేస్ ఉన్న శివరాజ్ కుమార్ ను అక్కడి ఫ్యాన్స్ కరుణాద చక్రవర్తి, శివన్న అని పిలుచుకుంటారు. ఇవాళ( బుధవారం) శివన్న బర్త్ డే సందర్భంగా ఈ ఘోస్ట్ మూవీ టీజర్ విడుదల చేశారు.
కన్నడతో పాటు తెలుగు టీజర్ ను కూడా ఒకేసారి విడుదల చేశారు. ఈ టీజర్ ఈ మధ్య కాలంలో వస్తోన్న ప్యాన్ ఇండియన్ సినిమాల లుక్ తో కనిపిస్తోంది. మేకింగ్ పరంగా మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నట్టుగా అర్థం అవుతుంది.
ఈ వీడియో కంటెంట్ చూస్తే.. శివన్న ఓ అడవిలో ఒంటరిగా ఉంటాడు. తన వెనక ఓ పెద్ద క్లాత్ కట్టి ఉంది. ఎదురుగా టేబిల్ పై కాస్ట్ విస్కీ బాటిల్ తో పాటు పెగ్ కలిపి గ్లాస్ ఉంటుంది. మరోవైపు పానీపూరీ ఉంది. అదే టైమ్ లో కొంతమంది అతన్ని వెదుక్కుంటూ అతనుండే ప్లేస్ కు వస్తారు.
అందరి చేతుల్లో గన్స్ ఉంటాయి. వీరిని చూస్తూ పానీపూరీని విస్కీలో ముంచుకు తిని.. తర్వాత ఆ గ్లాస్ ను వెనక్కి విసిరేసి సిగరెట్ ను దానిపై వేస్తాడు. వెనక క్లాత్ కాలిపోతుంది. ఓ పెద్ద యుద్ధ ట్యాంకర్ బయటకు వస్తుంది. అది చూసి ఎదురుగా ఉన్నవాళ్లంతా షాక్ తింటారు. అప్పుడు వారిని చూస్తూ ఈ ఘోస్ట్ అనబడే వ్యక్తి ఓ మాట అంటాడు.. ” మీరు గన్నుతో ఎంతోమందిని భయపెట్టి ఉంటారు. అంతకంటే ఎక్కువమందిని నా కళ్లుతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజి.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ” అంటాడు. మొత్తంగా టీజర్ అద్భుతంగా ఉంది.
ఇక ఓజి అనగానే మనకు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ సినిమా గుర్తొస్తే.. దానికి ముందే ఘోస్ట్ లో ఒజిగా రాబోతున్నాడు శివన్న. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. అత్యంత భారీ బడ్జెట్ తో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ఇది.…
కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు…
Director Rajamouli's film with superstar Mahesh Babu is in the pre-production stage. Soon.. they will…
The film 'Indian 2', which was completely stopped. 'Indian 2', which is currently in the…
If Natasimham Balakrishna commits once, he will not listen to anyone. He doesn't care how…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…