టాలీవుడ్

హృతిక్ తో ఎన్టీఆర్ ‘వార్’ మరో లెవెల్..!

‘దేవర’ పాట చిత్రీకరణ కోసం థాయ్‌లాండ్ వెళ్లిన తారక్ తిరిగి వచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పూర్తైన ‘దేవర’ నుంచి మరికొన్ని రోజుల్లో ఫ్రీ అవ్వనున్నాడు తారక్. దీంతో.. తన తర్వాతి సినిమా ‘వార్ 2’పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు. బాలీవుడ్ మల్టీస్టారర్ ‘వార్ 2’కి క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి ఓ క్రేజీ అప్డేట్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది.

బాలీవుడ్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ నుంచి వచ్చే సినిమాలకు సెపరేట్ క్రేజుంది. ఈ యూనివర్శ్ లోని సినిమాలు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలతో.. మత్తెక్కించే అందాలతో.. ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటాయి. ఈ కోవలోనే రెడీ అవుతోంది క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2’. సూపర్ డూపర్ హిట్ ‘వార్’ మూవీకి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తే.. ‘వార్ 2’లో హృతిక్ కి దీటైన పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ‘వార్’ మూవీలో హృతిక్-టైగర్ మధ్య వచ్చే ఫైట్స్, వాళ్లిద్దరూ కలిసి చేసిన డ్యాన్సెస్ హైలైట్ అయ్యాయి. ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా ‘వార్ 2’లో హృతిక్-తారక్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్సెస్.. ఈ డ్యాన్సింగ్ స్టార్స్ ఇద్దరూ కలిసి చేసే డ్యాన్సులు హైలైట్ అవ్వనున్నాయట.

ప్రధానంగా ‘వార్ 2’లో ఎన్టీఆర్ మేకోవర్ సరికొత్తగా ఉండబోతున్నట్టు ఇప్పటికే కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి. ఇక.. లేటెస్ట్ గా ‘వార్ 2’లోని క్లైమాక్స్ సీక్వెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫైట్ మాస్టర్ అనల్ అరసు. గత ఏడాది వచ్చిన ‘జవాన్’తో పాటు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు యాక్షన్ ఘట్టాలను తీర్చిదిద్దడంలో అనల్ అరసు పాత్ర ఉంది.

‘వార్ 2’లోని క్లైమాక్స్ లో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను తానే కొరియోగ్రాఫ్ చేస్తున్నట్టు ప్రకటించాడు అనల్ అరసు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఎన్టీఆర్-హృతిక్ మధ్య చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అవ్వనున్నట్టు అనల్ అరసు కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే యేడాది ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రానుంది.

Telugu70mm

Recent Posts

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల కింగ్ ప్రభాస్

తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…

8 hours ago

ముహూర్తానికి సిద్ధమైన వెంకటేష్-అనిల్ రావిపూడి చిత్రం

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…

8 hours ago

భారీ అంచనాలతో రాబోతున్న క్రేజీ సీక్వెల్స్

ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…

8 hours ago

జూలైలో వస్తోన్న విజయ్ ఆంటోని ‘తుఫాన్‘

మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…

9 hours ago

‘బచ్చల మల్లి‘గా మాస్ లుక్ లో అల్లరి నరేష్

రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…

9 hours ago

‘Kalki’ Is Sure To Hit A Thousand Crores

In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…

1 day ago