తాత ప్రోగ్రామ్ కు ఎన్టీఆర్ మళ్లీ డుమ్మా కొట్టాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబానికి మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు యేడాది కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అటు చంద్రబాబు కుటుంబం ఎప్పుడో ఆయన్ని పక్కన బెట్టింది. గతేడాది చంద్రబాబు భార్యపై కొందరు వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎన్టీఆర్ స్పందనపైనా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ ఎన్టీఆర్ పాల్గొనలేదు.

ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ కు ఆహ్వానం లేదు అని చాలామంది అనుకన్నారు. బట్ ఆయనకు ఇన్విటేషన్ ఇచ్చారు. అయినా వెళ్లలేదు. ఎన్టీఆర్ .. అంతా చెప్పుకుంటున్నట్టుగా వైసీపికి అనుకూలంగా ఉంటున్నాడు.. అందుకే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తాత శతజయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు అని మళ్లీ విమర్శించారు. ఇక చివర్లో హైదరాబాద్ లో శతజయంతి ఉత్సవాలు జరిగాయి.


ఆ టైమ్ లో సరిగ్గా తారక్ బర్త్ డే రోజునే ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. అప్పటికే బర్త్ డే వెకేషన్ కోసం 20మంది కుటుంబ సభ్యులతో మాల్దీవ్స్ కు టికెట్స్ వేసుకుని ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే ఇక్కడా హాజరు కాలేదు.

ఇక రీసెంట్ గా తమ అక్క సుహాసిని కొడుకు పెళ్లిలో మళ్లీ కుటుంబం మొత్తం కలిసింది. అక్కడ బాలయ్యతో పాటు మోక్షజ్ఞ సహా ఫ్యామిలీ మొత్తం కలిశారు. బట్ చంద్రబాబుతో కలవలేదు అంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ఆయన బొమ్మతో ఒక వంద రూపాయల నాణాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది.

ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించింది. బట్ ఈ సారి కూడా ఎన్టీఆర్ వెళ్లడం లేదు. యస్.. ఈ వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి కూడా జూనియర్ డుమ్మా కొడుతున్నాడు. అక్కడ చంద్రబాబుతో స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకనే వెళ్లలేదు అనేది టిడిపి వర్గాల వెర్షన్.

బట్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అందుకే వెళ్లలేకపోతున్నాడు అనేది తారక్ అనుచరుల వెర్షన్. షూటింగే అడ్డైతే అతను కాదంటే ఒక్క రోజు ఆపలేరా.. అనే డౌట్ మీకొస్తే ఏం చేయలేం. బట్ తారక్ మాత్రం స్ట్రాటజిక్ గానే పెద్దాయన ప్రోగ్రామ్స్ అన్నీ స్కిప్ చేస్తున్నట్టుగా మాత్రం కనిపిస్తోంది. దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా అనే ఆరాలు తీస్తున్నారు విశ్లేషకులు.

Related Posts