ఖుషీకి పెద్ద ప్రమాదమే పొంచి ఉంది.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ ఈ సెప్టెంబర్ 1న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికైతే సినిమాపై భారీ అంచనాలున్నాయి. బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో అయింది. ఇది మేకర్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు.

లవ్, మ్యారేజ్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైంది. పాటల వల్ల సినిమాకు చాలా పెద్ద బజ్ క్రియేట్ అయిందనేది నిజం. చివరగా వచ్చిన ఓసి పెళ్లామా అనే పాట సైతం ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ వరకూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ స్టఫ్ కాబట్టి అన్ని భాషల ఆడియన్స కు కనెక్ట్ అవుతుందనుకున్నారు.

అందుకే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే తెలుగులో వర్కవుట్ అయినా చాలు.. మిగతా భాషల రెవిన్యూ భారీ లాభాలుగా మారుతుందనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఎలా చూసినా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో ఉన్న ఖుషీకి తెలియకుండానే ఓ ప్రమాదం పొంచి ఉంది.


ఆ ప్రమాదం పేరు పవన్ కళ్యాణ్.. యస్.. ఒకప్పటి పవన్ కళ్యాణ్ సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తూ రికార్డులు కొడుతున్నారు ఫ్యాన్స్. ఓపెనింగ్స్ పరంగా ఫస్ట్ టైమ్ రిలీజ్ అవుతున్నంత సందడి రీ రిలీజ్ లలో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా వీర శంకర్ డైరెక్ట్ చేసిన గుడుంబా శంకర్ అనే చిత్రాన్ని పవన్ బర్త్ డే రోజు సెప్టెంబర్ 2న మళ్లీ విడుదల చేస్తున్నారు.

రీసెంట్ గా మిస్టర్ ప్రెగ్నంట్ మూవీ నిర్మాత రీ రిలీజ్ ల వల్ల మెయిన్ మూవీస్ కు ఇబ్బంది అవుతుందని చెప్పాడు. ఆ ప్రభావం ఖుషీపైనా పడుతుందనే అంచనాలు వేస్తున్నారు. దీంతో పాటు ఈ నెల 30న బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రాన్ని కూడా మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇదో అద్భుతమైన జానపద గాథ. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో.. అంటే గ్రాఫిక్స్ అప్పుడప్పుడే వస్తోన్న కాలంలో సింగీతం శ్రీనివాసరావు ఈ మూవీని చాలా గొప్పగా తీశారు. ఈ మూవీ ప్రభావం కూడా ఖుషీ పై పడుతుందనే వారూ లేకపోలేదు. నిజంగానే ఆ ఎఫెక్ట్ పడితే.. ఖుషీ కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.

Related Posts