రాజ్ తరుణ్ టీజర్ ఎలా ఉంది..

ఒకప్పుడు లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు రాజ్ తరుణ్. షార్ట్ ఫిల్మ్స్ నుంచి హీరోగా మారిన ఫస్ట్ హీరోగా కూడా అతన్ని చెప్పొచ్చు. ఉయ్యాల జంపాల తర్వాత అనూహ్యంగా యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను క్యాష్‌ చేసుకుంటూ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేశాడు. బట్ సక్సెస్ కంటిన్యూ కాలేదు.

ఒక్కో సినిమాకూ విజయాలు తగ్గుతూ వచ్చాయి. చివరికి అతని సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా రాని స్టేజ్ కు చేరుకున్నాడు. ఇంకా చెబితే అతన్ని జనం దాదాపు మర్చిపోయారనే చెప్పాలి. అలాంటి అతను సడెన్ గా ”తిరగబడర సామీ” అనే సినిమాతో వస్తున్నాడు.

విశేషం ఏంటంటే.. ఈ మూవీకి గతంలో యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వు లేని జీవితం వంటి సినిమాలు తీసిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది.


తిరగబడరా సామీ టీజర్ చూస్తే ఓ పిరికివాడైన కుర్రాడు చివరికి తనను ఇబ్బంది పెడుతున్న వ్యక్తులు, సమస్యలపై ఎలా తిరుగుబాటు చేశాడు. అందుకు దారి తీసిన అంశాలేంటనేది కనిపిస్తోంది. టైటిల్ చూడగానే స్టఫ్ ఇదే ఉంటుందని ఎవరైనా ఊహిస్తారు.

అందుకు తగ్గట్టుగానే ఉన్నా.. ఇంకేదో కొత్తదనం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్యను వాడుకున్న విధానం ఆకట్టుకుంటోంది. రాజ్ తరుణ్ ఇమేజ్ కు మించిన రొమాన్స్ తో ఉంది. యాక్షన్ కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఈ టీజర్ ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పాలి. మరి ఈ మూవీతో అయినా రాజ్ తరుణ్‌ విజయం అందుకుంటాడేమో చూడాలి.

Related Posts