అట్లుంటది నిఖిల్ డెడికేషన్ అంటే

హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది అందరికీ తెలుసు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. కొన్నాళ్లుగా తను ఎంచుకుంటోన్న కథలను బట్టి ప్యాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు పెంచుకున్నాడు. ముఖ్యంగా కార్తికేయ2 అతనికి ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తిరుగులేని గుర్తింపు తెచ్చింది. దీన్ని కొనసాగించే క్రమంలో చేసిన స్పై మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది. అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా మరోసారి ప్యాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు. కొన్నాళ్ల క్రితమే అనౌన్స్ అయిన ఆ సినిమ ఆ స్వయంభు. సంయుక్త హీరోయిన్ గా నటించబోతోన్న సినిమా ఇది. ఆదిత్య బహుదానమ్, భరత్ కృష్ణమాచారి ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు.


కంప్లీట్ ఫాంటసీ యాక్షన్ ఎడ్వెంచరస్ సినిమాగా రూపొందబోతోన్న ఈ చిత్రం రాజుల కాలం నాటి కథతో సాగుతుందట. అందుకోసం కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలతో పాటు హార్స్ రైడింగ్ వంటివి కాస్త ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఈ మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ తీసుకోవడానికి వియత్నాం వెళ్లాడు నిఖిల్. వియత్నాంలో ఈ తరహా పురాతన యుద్ధ విద్యలకు సంబంధించిన ట్రెయినర్స్ చాలామంది ఉన్నారట. వారిలో ఒక బెస్ట్ టీమ్ ను సెలెక్ట్ చేసుకుని కత్తి, బల్లెం, స్టంట్స్ తో పాటు హార్స్ రైడింగ్ లోనూ ఏకంగా నెల రోజుల ట్రెయినింగ్ తీసుకుంటాడట.


నిజానికి ఈ కాలం హీరోలు తమ వద్దకు వచ్చే కథల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. కథ ఏం డిమాండ్ చేస్తే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఏ మాత్రం వెనకాడ్డం లేదు. దేనికైనా రెడీ అంటూ ముందుకు దూకుతున్నారు.. దూసుకుపోతున్నారు. నిఖిల్ కూడా అలాగే మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ తీసుకుని నెల తర్వాత వస్తాడట. ఆ తర్వాత ఈ మూవీ షూటింగ్ కంటిన్యూస్ గా ఉంటుందని చెబుతున్నారు.

Related Posts