క్రియేటివ్ వర్క్ కు తెలుగు, తమిళ్ అన్న బౌండరీస్ దాటిపోతున్నాయి. ఒక భాషలో దర్శకులు మరో భాషలో సినిమాలు చేస్తున్నారు. హీరోలు కూడా భాషలు మారుస్తున్నారు. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్స్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడి హీరోలూ ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. కాకపోతే తమిళ్ దర్శకులెవరూ మనవారికి సాలిడ్ హిట్స్ ఇవ్వలేకపోతున్నారు అనేది నిజం.
అయినా మరో తమిళ్ దర్శకుడు తెలుగు సినిమా చేయబోతున్నాడు. అది కూడా నేచులర్ స్టార్ నాని హీరోగా. అతనెవరో కాదు.. తమిళ్ లో డాన్ అనే సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు శిబి చక్రవర్తి. డాన్ అతనికి తొలి సినిమా అయినా అద్బుతంగా హ్యాండిల్ చేశాడు.
హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హ్యూమరస్ గా చెబుతూనే హీరోయిజం పండించాడు. ఈ సినిమాతో శివకార్తికేయన్ కు భారీ హిట్ కూడా వచ్చింది. 2022లో వచ్చిన డాన్ తర్వాత శిబి చక్రవర్తికి ఇంకా కొత్త సినిమా సెట్ కాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లోనే కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయట. అలా డిస్కస్ చేస్తోన్న ఓ పాయింట్ నానికి అయితే బావుంటుందని చెప్పడంతో ప్రయత్నించాడు. నానిని మెప్పించాడు. అయితే ఈ మూవీ ఇప్పుప్పుడే పట్టాలెక్కడం కష్టమే అంటున్నారు.ప్రస్తుతం నాని కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయతో సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే ఈ మూవీ కథ ఇంకా ఫైనల్ కాలేదు. అటు శిబి చక్రవర్తి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు.
వీటిలో ఏది ముందైతే ఆ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కుతుంది. అంటే శిబి చక్రవర్తికి వెంటనే తమిళ్ మూవీ సెట్ అయితే అదయ్యాకే అతను నాని సినిమాకు వస్తాడు. ఒకవేళ నానికి నచ్చేలా వివేక్ ఆత్రేయ కథపూర్తి చేస్తే ముందు ఇది స్టార్ట్ అవుతుంది. ఏదైనా నెక్ట్స్ ఇయర్ ఈ ఇద్దరు దర్శకుల సినిమాలూ ఉంటాయని చెబుతున్నారు. మరి ఈ తమిళ్ దర్శకుడైనా మన తెలుగు హీరోకు హిట్ ఇస్తాడా..? లేక సెంటిమెంట్ లో కలిసిపోతాడా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…