టాలీవుడ్

నానీ… ఆ డైరెక్టర్ తో సినిమా చేయొద్దు..?

నేచురల్ స్టార్ నాని దూకుడు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సినిమా సెట్స్ లో ఉండగానే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటుంటాడు. ఈ ప్లానింగ్ విషయంలో నాని తర్వాతే ఎవరైనా అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తన కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు నాని.

నాని కంటే చాలా ముందే వచ్చిన ఎంతోమంది ఇంకా పాతిక సినిమాలు కూడా పూర్తి చేయలేదు. అదీ నాని దూకుడు. ఈ సమ్మర్ లో దసరా మూవీతో మంచి హిట్ అందుకున్న నాని ఈ 30వ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చేస్తున్నాడు.

ఓ కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మరోసారి జెర్సీలాగా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 70 శాతానికి పైగా అయిపోయిందట. మిగతాది ఆగస్ట్ వరకూ పూర్తవుతుంది. సినిమాను డిసెంబర్ థర్డ్ వీక్ లో 21న విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ మూవీ తర్వాత నాని తన బ్యానర్ లోనే రూపొందిన హిట్ ఫ్రాంచైజీలో నటిస్తాడు అనుకున్నారు. హిట్ లో విశ్వక్ సేన్, హిట్2లో అడవి శేష్‌ నటించారు.

రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సెకండ్ పార్ట్ లోనే థర్డ్ ప్రాంచైజీలో నాని నటిస్తాడు అనే హింట్ ఇచ్చారు. దీంతో అతని నెక్ట్స్ మూవీ ఇదే అనుకుంటే లేటెస్ట్ గా మరో ట్విస్ట్ వినిపిస్తోంది. నాని నెక్ట్స్ మూవీ ఓ తమిళ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడట. ఇది విని చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు.

హిట్ లాంటి ఆల్రెడీ హిట్ కళ ఉన్న సినిమాను కాదని ఓ తమిళ్ డైరెక్టర్ కు ఎస్ చెప్పాడంటే బలమైన కంటెంట్ ఏదో ఉండాలి అనేది కొందరి ఆలోచన. అయితే తమిళ్ డైరెక్టర్స్ ఎవరూ మన హీరోలకు హిట్స్ ఇవ్వడం లేదు. అందుకే నానిని ఆ తమిళ్ డైరక్టర్ తో సినిమా చేయొద్దని అప్పుడే ఫ్యాన్స్ నుంచి డిమాండ్ మొదలైంది. మరి ఈ తమిళ దర్శకుడు ఎవరు.. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటీ అనేది త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

Telugu 70mm

Recent Posts

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

15 mins ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

1 hour ago

Mirnalini Ravi

1 hour ago

Ketika Sharma

2 hours ago

Janhvi Kapoor

2 hours ago

NehaSolanki

2 hours ago