రాక్షస రాజు ఆగిపోలేదా..

రాక్షసరాజు.. ఈ టైటిల్ తో రానా హీరోగా ఓ సినిమా చేస్తున్నా అని గతంలో ప్రకటించాడు దర్శకుడు తేజ. ఒకే కథలతో వరుస సినిమాలు చేస్తోన్న తేజ అప్పుడప్పుడూ కొత్త కథలు కూడా ట్రై చేస్తుంటాడు. అలా ట్రై చేసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి.

రానా, కాజల్ జంటగా వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. మళ్లీ ఇన్ని రోజులకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. అయితే ఈ మూవీకి ముందు తేజ.. రానా తమ్ముడు అభిరామ్ హీరోగా అహింస అనే సినిమా చేశాడు.

ఆ మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను హింసకు కు గురి చేసింది. ఈ సినిమా రిజల్ట్ ను బట్టే తేజతో సినిమా చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలనుకున్నాడు రానా. అహింస అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రాక్షస రాజు అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ ఆగిపోలేదు.


తేజ – రానా కాంబినేషన్ లో రాక్షస రాజు సినిమా ఉంది. పైగా ఇది రెండు భాగాలుగా వస్తుందట. ప్రస్తుతం చాప్టర్ వన్, చాప్టర్ టూ అనే ట్రెండ్ ఒకటి నడుస్తోంది కదా. అంతకు ముందు సీక్వెల్స్ అన్నారు. ఇప్పుడు చాప్టర్స్ అంటున్నారు. కేజీఎఫ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ అన్ని భాషల్లోనూ విస్తరించింది. అలా రానా సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందట.

అయితే బాహుబలి, పుష్ప లాగా ఒక పార్ట్ తర్వాత మరో పార్ట్ షూటింగ్ అని కాకుండా.. ఒకేసారి ఏకధాటిగా రెండు భాగాలనూ చిత్రీకరిస్తారట. అప్పుడు దాన్ని రెండు ముక్కలు చేసి ఒక్కో ముక్కా వదలబోతున్నారు అంటున్నారు.

ఇక తేజ సినిమా అనగానే చాలా కొత్త మొహాలు కనిపిస్తాయి కదా..? ఈ సారి కొత్త ఫేస్ లతో పాటు కొందరు స్టార్స్ ను కూడా యాడ్ చేస్తారంటున్నారు. మరి ఆ స్టార్స్ తేజ మాట వింటారా..? తేజనే వాళ్ల మాట వింటాడా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. అహింస రిజల్ట్ చూసి రాక్షస రాజు పారిపోతాడు అనుకుంటే ఏకంగా రెండు భాగాలుగా వస్తానంటున్నాడు. ఏదేమైనా రానా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. ఏవంటారు..?

Related Posts