నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ ముందుగానే మొదలయ్యాయి. రేపు చైతన్య బర్త్ డే స్పెషల్ గా అతని 23వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు, టైటిల్ కూడా వచ్చేసింది. నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘తండేల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ చైతన్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ పోస్టర్ లో నడి సంద్రాన పడవలో కూర్చుని.. కండలు తిరిగిన దేహంతో గుబురు గడ్డం, జుట్టుతో రగ్గడ్ గా మాస్ లుక్ లో నాగచైతన్య ఆద్యంతం ఆకట్టుకుంటున్నాడు.
ఆద్యంతం మత్సకారుల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో నాగచైతన్యకు ‘100 పర్సెంట్ లవ్’ వంటి విజయాన్నందించిన గీతా ఆర్ట్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘కార్తికేయ 2’ తర్వాత ఈ మూవీతో మరో పాన్ ఇండియా హిట్ అందుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు డైరెక్టర్ చందూ మొండేటి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…