ఊరమాస్ పాత్రలో నాగ చైతన్య..

అక్కినేని నాగా చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ.. వీరి కలయికలో మూవీ వస్తుందనేది తేలిపోయింది. ఈ కాంబో గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని తాజాగా వీరు చేసిన రెక్కీ ద్వారా తెలిసిపోయింది. ఇక ఈ కథ గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి. ప్రధానంగా ఇది సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలరుల కథ. నిత్యం వేటకు వెళ్లేవాళ్లు.. అనుకోకుండా వేరే దేశం సముద్ర జలాల్లోకి వెళ్లడం.. అక్కడ అరెస్ట్ చేయబడటం.. వారి నుంచి తప్పించుకుని తిరిగి సొంత ఊరికి రావడం అనే నేపథ్యంలో ఈ కథ ఉంటుందంటున్నారు. అంటే సీతారామం సినిమాలో కూడా హీరో పాకిస్తాన్ కు వెళ్లి చిక్కుకుంటాడు. అక్కడే వారి జైల్లోనే హత్య చేయబడతాడు. అయితే ఇక్కడ వాళ్లు తిరిగి వస్తారు అంటున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య ఆ ఫిష్ బోట్ నడిపే వ్యక్తి పాత్ర చేస్తున్నాడు. అతన్ని తాండేల్ అంటారు. అదే ఈ సినిమాకు టైటిల్ గా పెట్టబోతున్నారు అనే ప్రచారం కూడా ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉంది గీతా ఆర్ట్స్ బ్యానర్.


ఇంతకు ముందు రామ్ చరణ్‌ రంగస్థలంలో చేసినట్టు, అల్లు అర్జున్ పుష్పలో చేసినట్టుగా నాగ చైతన్య కూడా ఓ ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలాంటి ఊరమస్ రోల్స్ చేసిన హీరోలంతా కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకున్నారు. అలా నాగ చైతన్య కూడా ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడు అనేలా ఈ పాత్ర చేయబోతున్నాడు. ఇందుకోసం అతను చాలా కష్టపడుతున్నాడు. ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కోసం రీసెంట్ గా పాండిచేరిలోని ఆదిశక్తి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి కొంత అవగాహన తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా పరిశ్రమలో ఏ నటుడూ చేయని నాగ చైతన్య చేస్తున్నాడు.యస్.. ఈ సినిమా కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి, నాగ చైతన్యతో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ఈ రెక్కీలో పాల్గొంటున్నారు.

ఇవాళ(గురువారం)వీరు చిత్రీకరణ చేయబోతోన్న శ్రీకాకుళంలోని మత్స్య కారుల కుటుంబాలను కలుసుకుని వారి జీవన విధానం, భాష, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ స్టడీ చేశాడు చైతన్య. అలాగే శుక్రవారం రోజు జాలరులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లబోతున్నారు. నిజం.. చైతన్య వారితో కలిసి సముద్ర జలాల్లోకి నిజంగానే వెళ్లబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ బోట్ నడిపే వ్యక్తి గురించి.. అది నడిపే స్టైల్ గురించి అధ్యయనం చేస్తాడు. దీంతో పాటు చందు మొండేటి కూడా కొత్త విషయాలు స్వయంగా తెలుసుకుంటాడు. ఆ మేరకు కథలో ఏవైనా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏదేమైనా ఒక పర్టిక్యులర్ గా ఒక హీరో.. తను చేయబోతోన్న పాత్ర గురించి అధ్యయనం చేయడానికి ఇలా నేరుగా ఆ ప్రాంతానికే వెళ్లి రెక్కీ చేసిన ఫస్ట్ హీరోగా నాగ చైతన్య పేరు చెప్పాలి. అవసరం అయితే హైదరాబాద్ లోనే వర్క్ షాప్ లు ఏర్పాటు చేసుకుంటారు తప్ప.. ఇలా ఒరిజినల్ లొకేషన్స్ కు వెళ్లి రెక్కీ చేయడం అంటే నాగ చైతన్య ఈ సినిమాను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. అతని కష్టానికి ప్రతిఫలంగా ఈ ఊరమాస్ గెటప్ సెంటిమెంట్ కు అనుగుణంగా ఓ బ్లాక్ బస్టర్ పడితే అక్కినేని బుల్లోడి రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది.

Related Posts