గ్రేట్ మ్యూజిషియన్ బయోపిక్ లో ధనుష్

టాలెంటెడ్ స్టార్ ధనుష్ కథల ఎంపిక టిపికల్ గా ఉంటుంది.తన రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరోలెవరూ అతనిలాంటి కథలను ఎంచుకోరు. స్టోరీ నచ్చితే ఆ పాత్రలో ఒదిగిపోతాడు ధనుష్. కటౌట్ కు సంబంధం లేకుండా ఊరమాస్ స్టోరీస్ లోనూ అదరగొడతాడు. అలాంటి ధనుష్ ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించబోతున్నాడు.

అది కూడా ఇండియాస్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన ఇళయరాజా బయోపిక్ లో. యస్.. ఇళయరాజా పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ధనుష్. ఈ చిత్రాన్ని బాల్కీ అనే బాలీవుడ్ దర్శకుడు రూపొందించబోతున్నాడు అంటున్నారు. బాల్కీతో ధనుష్ ఇంతకు ముందు అమితాబ్ తో కలిసి ‘షమితాబ్’ అనే సినిమాలో నటించి ఉన్నాడు.దీనికి తోడు సంగీతంలో ధనుష్ కు కూడా కొంత ప్రవేశం ఉంది. తను పాటలు రాస్తాడు. పాడతాడు. సంగీతం చేయగలడు కూడా.


ఇంతకు ముందు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు రాజా పాత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను అన్నాడు ధనుష్. ఇప్పుడు వచ్చింది. సో.. అతనే రాజా పాత్రలో నటిస్తాడు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా రావాల్సి ఉన్నా.. ఇళయరాజా బయోపిక్ లో నటించేంది ధనుషే అంటున్నారు. నిజంగా ధనుష్ పర్సనాలిటీ కూడా అందుకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.ఇక తమిళనాడులోని ఓ మారుమూల పల్లెలో డప్పులు కొట్టే దళిత కులం నుంచి వచ్చిన దేశమే గర్వించేంత గొప్ప సంగీత దర్శకుడుగా ఎదిగిన ఇళయరాజా జీవితం ఖచ్చితంగా వెండితెరపై ఆదర్శనీయంగానే ఉంటుందనుకోవచ్చు.

Related Posts