ఆర్ట్ డైరెక్టర్ చావుకు కారణం అదేనా

బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ నిన్న(బుధవారం) ముంబై శివార్లలో ఉన్న తన స్టూడియోలోనే చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా, హత్యా అనే అనుమానాలు వ్యక్తం చేశారు చాలామంది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ లు మరణించిన రోజే ఆయన బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ పోస్ట్ మార్టమ్ లో ఆయన ఉరి వేసుకున్నట్టుగా తేలింది. అయితే ఆయనే ఉరి వేసుకున్నారా లేక ఎవరైనా చంపి జాగ్రత్తగా అలా ప్లాన్ చేశారా అనే అనుమానాలూ ఇంకా అలాగే ఉన్నాయి. అయితే ఇదే టైమ్ లో నితిన్ దేశాయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.


నితిన్ దేశాయ్ తన స్టూడియోను ముంబై 80కిలోమీటర్ల దూరంలో కట్టుకున్నారు. దీని ద్వారా కేవలం ఆర్ట్ వర్క్ మాత్రమే కాకుండా.. ఆర్గనైజింగ్, మెయిన్టెనింగ్ తో పాటు పురావస్తు వస్తువులకు నకళ్లు తయారు చేయడం వంటివి చేస్తుండేవారట. ఈ పేరు చెప్పే ముంబైలోని ‘ఈసిఎల్” అనే కంపెనీ నుంచి 2016 , 2018లొ విడదతల వారీగా 185 కోట్లు అప్పుగా తీసుకున్నాడట. కొన్నాళ్లు బానే కట్టినా.. తర్వాత వాయిదాలు చెల్లించడం ఆపేశాడట. దీంతో లోన్ ఇచ్చిన వాళ్లు కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ తీర్పులు నితిన్ కువ్యతిరేకంగా వచ్చింది. అతను 2021లో తన స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ కారణంగానే చెల్లించలేపోయానని కోర్ట్ కు చెప్పినా సరైన ఆధారాలు లేవు.

దీంతో కోర్ట్ అప్పు తీసుకున్న వ్యక్తి స్టూడియోతో పాటు అతని వస్తువులన్నీ రికవర్ చేసి వేలం ద్వారా ఆ మిగతా మొత్తం చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం వడ్డీతో కలిపి 2021కే 252.8 కోట్లు అయిందట. ఆ టైమ్ లో ఏదో అడ్జెస్ట్ మెంట్ జరిగినా.. చివరికి ఆ అప్పు కట్టలేకనే నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు అని బాలీవుడ్ లో చాలామంది అనుకుంటున్నారు. ఈ మేరకు డైరెక్ట్ గా ఇదే కారణం అని చెప్పలేదు కానీ సీనియర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ హన్సల్ మెహతా అప్పులవల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని.. కొంతమంది మీడియేటర్స్ వల్ల అమాయకులు నష్టపోతున్నారు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కారణాలేవైనా.. బాలీవుడ్ ఓ గొప్ప ఆర్ట్ డైరెక్టర్ ను కోల్పోయింది.

Related Posts