పట్టు చీరలో మెరిసిపోతున్న నభా నటేష్

టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగానే సడెన్ గా మాయమైంది కన్నడ బ్యూటీ నభా నటేష్. పోనీ.. మాతృ భాష కన్నడలో సినిమాలు ఏమైనా చేసిందా? అంటే అదీ లేదు. అయితే.. నభా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమె ఓ యాక్సిడెంట్ బారిన పడటమేనట. ప్రస్తుతం ఆ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న నభా.. నిఖిల్ ‘స్వయంభు‘తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంది. పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో యువరాణిగా కనువిందు చేయబోతుంది.

మళ్లీ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిన నభా నటేష్.. తెలుగుదనం ఉట్టిపడే కట్టూ బొట్టుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. నేడు ఉగాది పర్వదినం సందర్భంగా.. అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా తయారయ్యింది. నభా నటేష్ పట్టుచీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts