ముఖ్య గమనిక’ గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణలు వేణు మరళీధరన్‌ ని డైరెక్టర్‌గా లాంచ్ చేస్తున్న మూవీ ‘ముఖ్య గమనిక’. ఈ సినిమాలో విరాన్, లావణ్యలు హీరో హీరోయిన్లు. ఈ మూవీ ఫిబ్రవరి 23 న గ్రాండ్ రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ఈ సినిమా హీరో విరాన్‌ తనకు జిమ్‌ ఫ్రెండ్ అనీ, తనను అన్నా అని పిలుస్తాడు కానీ నేనే అన్నా అని పిలవాలనీ విరాన్‌పై అభిమానం చూపించాడు విశ్వక్‌సేన్. విరాన్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సొంత కష్టంపై ఎదుగుతున్నాడన్నారు. టీమ్‌ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ..సినిమా పెద్ద విజయం సాధించాలని కాంక్షించారు విశ్వక్‌సేన్.


ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్న విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అల్లు అర్జున్ గారే అన్నారు డైరెక్టర్ వేణు మురళీధరన్‌. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టమన్నారు. విరాన్‌ సమయాన్ని కరెక్ట్ గా పాటించే వ్యక్తి. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసిందని మెచ్చుకున్నారు. కిరణ్ అందించిన మ్యూజిక్ కు, అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు డైరెక్టర్‌ వేణు మురళీధరన్‌.
హీరోయిన్‌ లావణ్య మిగతా గెస్ట్స్‌ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts