చెర్రీ,సల్లూ భాయ్ చేతుల మీదుగా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ ‘ ట్రైలర్ లాంచ్

దేశభక్తితో పాటు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్‌ కాకుండా..అన్ని వర్గాలను ఆకట్టుకునే అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ ఆపరేషన్‌ వాలెంటైన్. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా డైరెక్షన్‌లో సోనీ పిక్చర్స్‌ నిర్మించారు. తెలుగు హిందీ భాషల్లో మార్చి 1 న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగు వెర్షన్‌ రామ్‌చరణ్, హిందీ వెర్షన్ సల్మాన్‌ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా లాంచ్‌ చేసారు.


భారత వైమానిక దళం (IAF) ధైర్యానికి నివాళిగా, ఆపరేషన్ వాలెంటైన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్, భావోద్వేగాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. కథాంశం అద్భుతంగా వుంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, సంగీతం తో పాటు కొంచెం రోమాన్స్ కూడిన ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. డైలాగ్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులని ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్ ని పంచుతోంది.
ప్రేక్షకులు కష్టపడి సంపాదించిన డబ్బుని టికెట్ రూపంలో మాకు ఇస్తారు. ప్రేక్షకులు ఖర్చుపెట్టే డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి కష్టపడుతుంటాను. ప్రేక్షకులకు కొత్త కథ చూపించాలనే ప్యాషన్ నాకు, మా టీంకు వుంది. అందుకే ‘ఆపరేషన్ వాలెంటైన్’లాంటి సినిమాని తీయగాలిగాం. తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది. చాలా కొత్తగా, ఎడ్జ్ అఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసే చాలా సీన్స్ ఇందులో వున్నాయి. మార్చి 1న ఈ సినిమాని చాలా గర్వంగా గుండెలు నిండా దేశభక్తితో చూసి మన జవాన్స్ కి సెల్యూట్ కొడతారన్నారు హీరో వరుణ్‌ తేజ్‌.


‘ఆపరేషన్ వాలెంటైన్’ చాలా స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. వరుణ్ తేజ్ వండర్ ఫుల్ కో స్టార్. చాలా సపోర్ట్ చేశారన్నారు హీరోయిన్ మానుషి చిల్లర్.
ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. తెలుగులో మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ యాక్షన్ సినిమా చేసిన ఘనత వరుణ్ తేజ్ కి దక్కుతుందన్నారు నవదీప్.
వరుణ్ తేజ్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు. వారి వలనే ఈ సినిమా సాధ్యపడింది. ఈ సినిమా సమిష్టి కృషి అంటూ టీమ్‌ ని మెచ్చుకున్నారు డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్ హడా.

Related Posts