‘వాస్తవం’ టీజర్‌ గ్రాండ్ రిలీజ్‌

జీవన్‌ బండి డైరెక్షన్‌లో ఆదిత్య ముద్గల్‌ నిర్మించిన మూవీ ‘వాస్తవం’. ఈ సినిమాలో మేఘశ్యాం, రేఖ నిరోషా హీరో హీరోయిన్లు. వాస్తవం నుంచి రిలీజయిన ప్రమోషనల్ వీడియోస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌ గ వాస్తవం టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌.
రెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోందన్నారు ప్రొడ్యూసర్‌ ఆదిత్య ముద్గల్‌.


తన కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన ఆదిత్య ముద్గల్‌కు కృతజ్ఞతలు చెప్తూ.. ఆర్టిస్టులు, టెక్నిసియన్స్‌ సపోర్ట్‌ను మరువలేనన్నారు డైరెక్టర్ జీవన్‌బండి. ముఖ్యంగా రేఖ నిరోషా, మేఘశ్యాంలు అద్భుతంగా నటించారనీ.. సినిమా పిఆర్‌ ఇచ్చిన మ్యూజిక్ అదనపు బలం అన్నారు జీవన్‌.
మా సినిమా లో చాలా మంచి కంటెంట్ ఉంది కాని సరైన సపోర్ట్ లేదు. మీడియా ప్రేక్షకులే మాకు సపోర్ట్. ఈ సినిమా చాలా కష్టపడి తీసాం. అందరికీ నచ్చే కథ అవుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మీ సపోర్ట్ ఆశీస్సులు మాపై ఉండాలని ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు హీరోయిన్ రేఖ నిరోషా.


నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడ కథ నుంచి డివియేట్ అవ్వకుండా చాలా బాగా కథని తీసుకుని వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి డైరెక్టర్ జీవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు హీరో మేఘశ్యాం.

Related Posts