ముచ్చటగా మూడు ఆఫర్లతో ‘మిస్టర్ బచ్చన్‘ బ్యూటీ

తెలుగులో ఇంకా తొలి సినిమా విడుదలకాకుండానే.. వరుస ఆఫర్లను కొల్లగొడుతోంది పూణె బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. అంతకుముందు బాలీవుడ్ లో ‘యారియానా 2‘లో మెరిసిన భాగ్యశ్రీని.. ఏరికోరి ‘మిస్టర్ బచ్చన్‘ కోసం ఎంచుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజకి జోడీగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో తన నాభి అందాలతో కుర్రకారును కైపెక్కించింది భాగ్యశ్రీ.

‘మిస్టర్ బచ్చన్‘ చిత్రీకరణ దశలో ఉండగానే.. తెలుగులో మరో రెండు క్రేజీ ఆఫర్స్ తన కిట్టీలో వేసుకుందట ఈ బ్యూటీ. వాటిలో ఒకటి విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి చిత్రం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలుత శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. ఆ స్థానంలో ‘ప్రేమలు‘ భామ మమిత బైజు నటించనుందనే ప్రచారం జరిగినా.. చివరకు ఆ పాత్ర భాగ్యశ్రీ చెంతకు చేరిందనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.

విజయ్ దేవరకొండతో పాటు.. నేచురల్ స్టార్ నాని సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుందట భాగ్యశ్రీ బోర్సే. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో నాని హీరోగా సుజీత్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నానికి జోడీగా భాగ్యశ్రీని ఎంపికయ్యిందట. త్వరలోనే.. విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో నాయికగా భాగ్యశ్రీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Related Posts