టాలీవుడ్

మెగాస్టార్ తో త్రిష, శ్రీ లీల

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర్నుంచీ మెగాస్టార్ మంచి దూకుడు మీదున్నాడు. ఆచార్య తప్ప అన్నీ బ్లాక్ బస్టర్సే ఉన్నాయి. రీసెట్ గా వచ్చిన వాల్తేర్ వీరయ్య ఏకంగా 240 కోట్ల వరకూ కొల్లగొట్టింది. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు చిరంజీవి.

మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అతని చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళంకు ఇది రీమేక్. తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. ఇక ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చేసే సినిమా కన్ఫార్మ్ అయింది.


సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడు చూద్దాం. నేల టికెట్, బంగర్రాజు చిత్రాలతో ఆకట్టుకున్న కళ్యాణ్‌ కృష్ణ కురసాలతో చిరంజీవి సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిషను తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైతే ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. దాదాపు తను ఖరారయ్యినట్టే అంటున్నారు.

విశేషం ఏంటంటే ఈ చిత్రంలో చిరంజీవితో పాటు డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. వీరిద్దరూ తండ్రి కొడుకులు అంటున్నారు. అదే జరిగితే చిరంజీవి ఇమేజ్ ను దాటి మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే భావించాలి. ఇలా కథలకు ప్రాధాన్యత ఇస్తే ఆయన్నుంచి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తాయి.

అలాగే సిద్ధుకు జోడీగా లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీలను తీసుకుంటున్నారు అనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే శ్రీ లీల చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అరడజనుకు మించి సినిమాలకు కమిట్ అయి ఉంది. అయినా ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.


ఇక త్రిష ఇంతకు ముందు మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో జోడీ కట్టింది. అప్పట్లో తను మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్. అఫ్‌ కోర్స్ ఇప్పటికీ తన స్టార్డమ్ అలాగే ఉంది. సక్సెస్ రేట్ కూడా తగ్గలేదు. ఇప్పటికే తమిళ్ టాప్ హీరోలైన విజయ్, అజిత్ ల సరసన నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అలాంటి త్రిష మెగాస్టార్ కు జోడీ అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు మరింత హైప్ వస్తుంది. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.

Telugu 70mm

Recent Posts

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

1 hour ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

1 hour ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

4 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

5 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

7 hours ago

‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…

7 hours ago