టాలీవుడ్

మెగాస్టార్ వర్సెస్ బాలయ్య .. ఎవరి టీజర్ బావుంది

స్టార్ హీరోల మద్య ఫ్రెండ్షిప్ ఉంటుంది. వారి అభిమానుల మధ్య కంపేరిజన్స్ ఉంటాయి. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది.. ఎంత కలెక్ట్ చేసింది అన్న దగ్గర ఫ్యాన్స్ మధ్య ఎక్కువ పంచాయితీలు కనిపించేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మొదలై టీజర్, ట్రైలర్, సినిమా, రివ్యూస్, పబ్లిక్ టాక్స్, రెవిన్యూ… ఇలా ప్రతిదీ పోలికలు పెట్టి మా హీరో గొప్పోడంటే మా హీరో గొప్పోడని వాదులాడుకుంటున్నారు. అలా ఇప్పుడు ఆ మధ్య వచ్చిన బాలకృష్ణ భగవంత్ కేసరి, లేటెస్ట్ గా వచ్చిన చిరంజీవి భోళా శంకర్ సినిమా టీజర్స్ లో ఏది బావుంది అనే పోటీ మొదలైంది.

ఈ మేరకు ఆల్రెడీ సోషల్ మీడియాలో వార్స్ స్టార్ట్ అయ్యాయి.
వీరిలో చాలామంది బాలకృష్ణ భగవంత్ కేసరికి ఎక్కువగా ఓటేస్తున్నారు. అది కూడా కేవలం హీరో ఇమేజ్ ను, ఎలివేషన్స్ ను ముడిపెట్టి రూపొందించిన టీజర్. డైలాగ్స్ చాలాబావున్నాయి. బాలకృష్ణ కొత్తగా కనిపించాడు. యాక్షన్ ఉన్నా.. అది బాలయ్య రెగ్యులర్ మోడ్ లో లేదు.


కానీ భోళా శంకర్ కు ఆ ఫ్రెష్ నెస్ కనిపించడం లేదు. కేవలం వింటేజ్ మెగాస్టార్ ను చూపిస్తున్నాం అనే కోణంలోనే టీజర్ ను రూపొందించారు తప్ప.. ఇందులో కొత్తగా ఏం లేదు. పైగా తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్స్ వల్ల ఇది కావాలని చేసిన వ్యవహారంలా ఉంది తప్ప ఆ సహజత్వం కనిపించలేదు అనే టాక్ కూడా వచ్చింది.


భగవంత్ కేసరి టీజర్ బాలయ్య ఒన్ మేన్ షోలా ఉంది. అంటే బర్త్ డే స్పెషల్ గా వచ్చింది కాబట్టి మరో పెద్ద ఫేస్ ను చూపించలేదు.

భోళాలో హీరోయిన్, కీర్తి సురేష్ తో పాటు విలన్ న కూడా చూపించారు. కానీ ఎందుకో ఎప్పుడూ మెగాస్టార్ మూవీ టీజర్ కు వచ్చేంత హై ఈ టీజర్ లో లేదు అనే కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

ఓవరాల్ గా చూస్తే ఈ రెండు టీజర్స్ కేవలం హీరోల ఇమేజ్ లను బట్టి రూపొందించినవే అయినా.. ఎందుకో కాస్త ఎక్కువ మొత్తం ఓట్లు భగవంత్ కేసరి టీజర్ కే పడుతున్నాయి అంటున్నారు. మరి దీనిపై ఇద్దరు హీరోల అభిమానుల ఫీలింగేంటో ..?

Telugu 70mm

Recent Posts

Yashika Aannand

19 mins ago

Daksha Nagarkar

24 mins ago

Rashi Singh

28 mins ago

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

1 hour ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

2 hours ago

Mirnalini Ravi

2 hours ago