మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తోందంటేనే అందరు మెగా హీరోల ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అలాంటిది అందరు హీరోల సినిమాలూ ఒకే నెలలో విడదవులున్నాయంటే ఇంక ఆ క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా..? యస్..ఈ నెలాఖరు నుంచి ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకూ థియేటర్స్ అన్నీ మెగా మూవీస్ తో సందడి చేయబోతున్నాయి.
ఇక ఈ నెల 28న పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇప్పటికైతే భారీ క్రేజ్ ఉందీ మూవీపై. తాజాగా వచ్చిన పాట కూడా ఆకట్టుకుంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ మెప్పించింది. ప్రమోషన్స్ స్టార్ట్ అయితే ఈ క్రేజ్ మరింత పెరుగుతుంది.
బ్రో వచ్చిన రెండు వారాలకు మెగాస్టార్ వస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ నటించిన భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. తమన్నా హీరోయిన్ గా.. కీర్తి సురేష్ .. చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఈ చిత్రం తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళంకు రీమేక్. కాకపోతే తెలుగులో మెగా ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా మార్పులు చేశారని టాక్. రీసెంట్ గా వచ్చిన టీజర్ మెగా స్టార్ ఎలివేషన్స్ కే సరిపోయిందన్న టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం చిరంజీవి వెకేషన్ లో ఉన్నాడు. రాగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారేమో. భోళా కమర్షియల్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఇక ఆగస్ట్ 18న ఉప్పెన కుర్రాడు వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేవశ విడుదల కాబోతోంది. ఉప్పెన తర్వాత చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా ఆకట్టుకోలేదు. రెండూ ఫ్లాపులే. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లోఉన్నాడు వైష్ణవ్. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మళయాల టాలెంటెడ్ యాక్టర్ జోజూ జార్జ్ విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుండటం విశేషం.
ఇక ఆఖరుగా వస్తోన్న సినిమా గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ హీరోగా నటించి ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య హీరోయిన్. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. అంటే ఇంకా వీళ్లు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. అంటే కనీసం టీజర్, లిరికల్ సాంగ్స్ లాంటివి కూడా రాలేదు. అందుకే ఇంకా బజ్ క్రియేట్ కాలేదు. కానీ కాంబినేషన్ క్రేజ్ ఉందని మాత్రం చెప్పొచ్చు. ఇందులో వరుణ్ ఓ స్పై గా నటిస్తున్నాడు అనే ప్రచారం మాత్రం ఉంది.
సో.. ఒక నెల రోజుల్లోనే నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. అందులో టాప్ స్టార్స్ నుంచి స్మాల్ హీరోస్ వరకూ ఉన్నారు. అయినా మెగా ఫ్యామిలీ హీరోలు అంటే ఫ్యాన్స్ అంతా చూడాల్సిందే కదా..? సో ఈ నెలలో మెగా ఫ్యాన్స్ ఖర్చుల జాబితా ఖచ్చితంగా పెరుగుతుంది.
ప్రస్తుతం తెలుగులో ఉన్న విలక్షణ దర్శకుల్లో క్రిష్ ఒకరు. తొలి సినిమా ‘గమ్యం‘ నుంచి తనకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని…
‘అజ్ఞాతవాసి‘ తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్…
Rajamouli is the first in the list of directors who have not failed in Telugu.…
Succession is very common in film industry. Almost all the star heroes in the Telugu…
An unexpected update has come from Power Star Pawan Kalyan's first period drama 'Hari Hara…
May 4 is the birth anniversary of director Dasari Narayana Rao. Tollywood celebrates that day…