పాత రోజుల్ని గుర్తుచేసిన మెగా 156

మెగాస్టార్ చిరంజీవి మెగా 156 అట్టహాసంగా ప్రారంభమైంది. పాత రోజుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ తోనే కొత్త సినిమాలకు ముహూర్తాలను జరిపేవారు. అదే పద్ధతిలో మెగా 156ని మొదలుపెట్టడం విశేషమని చెప్పాలి.

ఈ చిత్రానికి మరకతమణి కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు. గతంలో చిరంజీవితో ‘ఘరానామొగుడు, ఆపద్భాంధవుడు, ఎస్.పి.పరశురాం’ సినిమాలకు సంగీతాన్నందించారు కీరవాణి. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా ఇది.

మెగా 156లో ఆరు పాటలుంటాయని తెలిపారు కీరవాణి. సినిమాలో వచ్చే ఓ సెలబ్రేషన్స్ సాంగ్ తో రికార్డింగ్ మొదలుపెట్టారట. అందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి చంద్రబోస్ గీత రచయిత కాగా.. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు.

Related Posts