ఆశ్చర్యపరుస్తున్న లియో వసూళ్లు

కొంతమంది స్టార్స్ కి హిట్స్, ఫ్లాప్స్ తో ఎలాంటి సంబంధం లేదు. ఆ హీరోలు నటించిన సినిమాలొచ్చాయంటే చాలు టాక్ తో పనిలేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంటోంది. అలాంటి హీరోల్లో తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ ఒకడు. విజయ్, లోకేష్ కనకరాజ్ క్రేజీ కాంబోలో వచ్చిన ‘లియో’ ఫస్ట్ డే నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా.. వరల్డ్ వైడ్ గా లియో సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా లియో నాలుగు రోజులకే రూ.400 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందంటున్నారు. తొలిరోజే తెలుగులో రూ.16 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది. దసరా సెలవులు కలిసిరావడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ స్టెడీగానే కొనసాగుతున్నాయి.

గత పాతికేళ్లుగా తమిళంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న విజయ్.. తెలుగులోకి లేటుగానే ఎంట్రీ ఇచ్చాడు. తన కాంటెంపరరీస్ విక్రమ్, సూర్య లతో పోల్చుకుంటే విజయ్ మార్కెట్ తక్కువగా ఉండేది. అయితే.. గత కొన్నేళ్లుగా విజయ్ ఇక్కడ మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. ‘తుపాకి, స్నేహితుడు, అదిరింది, మాస్టర్, వారసుడు’ వంటి సినిమాలు ఇక్కడా మంచి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ‘లియో’ నెగటివ్ టాక్ తెచ్చుకున్నా బ్రేక్ ఈవెన్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

Related Posts