నవంబర్ నుంచి ‘కల్కి’ షూట్ లో ప్రభాస్

ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఫ్యాన్స్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ వేడుకలో ప్రభాస్ లేని లోటు అయితే ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం అమెరికాలో మోకాలి సర్జరీ పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు ప్రభాస్. వచ్చే వారం ఇండియా తిరిగి రాబోతున్నాడు. ఆ తర్వాత షూటింగ్స్ పై దృష్టి పెట్టనున్నాడట.

ఇప్పటికే ‘సలార్’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. డిసెంబర్ 22న ‘సలార్’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అమెరికా నుంచి రాగానే మరో చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’ షూట్ లో పాల్గొంటాడట ప్రభాస్. నవంబర్ 10 నుంచి ఈ సినిమా షూట్ లో పాల్గొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకూ ప్రభాస్ నటించిన సినిమాలు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తే.. పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ రాబోతున్న చిత్రం ‘కల్కి’. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనె, దిశా పఠాని వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ‘కల్కి’ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా షూట్ లోనూ పాల్గొననున్నాడట పాన్ ఇండియా స్టార్.

Related Posts