మారుతీనగర్‌ సుబ్రమణ్యం టైటిల్ సాంగ్ రిలీజ్

ఇప్పటిదాకా రావు రమేష్‌ విలన్‌, క్యారెక్టర్ ఆర్టిస్ట్, .. కానీ మారుతీనగర్‌ సుబ్రమణ్యంతో మెయిన్‌లీడ్ ఆర్టిస్ట్. ఇంద్రజ తో కలిసి తెలుగు ఆడియెన్స్‌ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు. లక్ష్మణ్‌ కార్య డైరెక్షన్‌లో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు ఈ సినిమా ను నిర్మించాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్‌ వినూత్నం గా చేసారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, కేజీఎఫ్‌ 2 లో రావు రమేష్ ప్లే చేసిన క్యారెక్టర్లతో ఓ వీడియో చేయించి అనౌన్స్ చేయడమే కాకుండా.. క్యూ ఆర్ కోడ్‌తో ఫస్ట్‌ లుక్ రిలీజ్‌ చేయడం వైరల్ అయ్యింది. దాంతో సినిమాపై న్యూట్రల్ ఆడియెన్స్‌ లోనూ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మారుతినగర్ సుబ్రమణ్యం టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. రావు రమేష్‌ క్యారెక్టరైజేషన్‌ ను తెలిపేలా భాస్కరభట్ల రాసిన సాహిత్యానికి కళ్యాణి నాయక్‌ స్వరపరిచిన బాణీకి అద్భుతంగా పాడాడు క్రేజీ సింగర్ రామ్‌ మిరియాల.

సోషల్ మీడియాలో నేనే సుబ్రమణ్యం అంటూ సాగే పాట రీల్స్‌తో షేకవుతుంది. లుంగీలో రావు రమేష్ గెటప్ అద్భుతంగా ఉందనీ… నేటివ్ ఫీలింగ్ వచ్చిందని ఎంతోమంది మెసేజ్‌లు పెడుతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ పాట వైరల్ అవుతోంది. సినిమాపై బజ్‌ మరింత పెంచింది.

Related Posts