‘ టిల్లు స్క్వేర్ ‘ సెన్సార్ కంప్లీట్‌

ఎంటర్‌టైన్‌మెంట్ లో కల్ట్ అనే పదం డిజె టిల్లు సినిమాకే వర్తిస్తుందేమో. సిద్దు జొన్నలగడ్డ అప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తయితే… డిజె టిల్లు మరో ఎత్తు. ఈ సినిమాతో సిద్దు ఇమేజ్‌ పూర్తి గా మారిపోయింది. స్టార్‌బోయ్‌ గా ఫ్యాన్స్ చేత పిలవబడుతున్నాడు. డిజె టిల్లు ఎంత సెన్సేషన్ అయ్యిందో.. అంతకుమించి అనేలా డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా టిల్లు స్క్వేర్ రెడీ అయ్యిందంటున్నారు మేకర్స్. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 29 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ సినిమా కోసం కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లవర్స్‌ వెయిట్ చేస్తున్నారు. ‘రాధిక‘, ‘టికెటే కొనకుండా‘, ‘ఓ మై లిల్లీ‘ పాటలతో పాటు ఇతర ప్రచార చిత్రాలు విడుదలై సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశాయి.
టిల్లు స్క్వేర్ సెన్సార్ పూర్తయింది. కంప్లీట్ ఎంటర్‌టైనర్ అంటూ సెన్సార్ టీమ్‌ మేకర్స్‌ ను మెచ్చుకోవడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి “యు/ఎ” సర్టిఫికేట్ ఇచ్చింది. ‘టిల్లు స్క్వేర్‘ చిత్రం ‘డీజే టిల్లు‘ను మించిన విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.

Related Posts